వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరాబాబా జైలు జీవితం: ఇంత బతుకు బతికి చివరికి.. కూలి పనిచేస్తూ...

వందలాది ఎకరాల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని రాజసం వెలగబెట్టిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ జీవితం రేప్ కేసులో జైలు పాలయ్యాక ఎలా ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సిర్సా: వందలాది ఎకరాల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని రాజసం వెలగబెట్టిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ జీవితం రేప్ కేసులో జైలు పాలయ్యాక ఎలా ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.

పట్టేశారు: హనీ ప్రీత్ సింగ్ ఆచూకీ లభ్యం, వేషం మార్చి.. ఖాట్మాండూలో, కరెక్ట్ లొకేషన్ గుర్తింపు..పట్టేశారు: హనీ ప్రీత్ సింగ్ ఆచూకీ లభ్యం, వేషం మార్చి.. ఖాట్మాండూలో, కరెక్ట్ లొకేషన్ గుర్తింపు..

ఆధ్యాత్మిక కార్యక్రమాలు పేరుతో రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన డేరాబాబా ప్రస్తుతం జైలులో కూలి పని చేస్తున్నాడు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసుల్లో ఇరవై ఏళ్ల జైలుశిక్ష పడ్డ గుర్మీత్ సింగ్ రొహ్‌తక్‌లోని సునారియా కారాగారంలో ఉంటున్నారు.

బాబా, హనీలది ఒకే కంచం, ఒకే మంచం.., 'మల్లీశ్వరి' లాంటి ఫిగర్ కోసం, పారిపోయేముందు ఏం చేసిందంటే..బాబా, హనీలది ఒకే కంచం, ఒకే మంచం.., 'మల్లీశ్వరి' లాంటి ఫిగర్ కోసం, పారిపోయేముందు ఏం చేసిందంటే..

గుర్మీత్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడగానే పంచకుల, పరిసరాల్లో అతడి అనుచరులు పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో 38 మంది చనిపోగా, 250 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

మొదట్లో మొరాయించినా...

మొదట్లో మొరాయించినా...

చుట్టూ లక్షలాది మంది భక్తులు, మిరిమిట్లు గొలిపే సెట్టింగులు, హంసతూలికా తల్పాలు, బంగారు కంచాలు, మంచాలు, సింహాసనాలు.. ఇలా ఒకటేమిటి.. సకల సౌఖ్యాలు అనుభవించిన సన్యాసి డేరా సచ్ఛాసౌధ అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ ఇప్పుడు రోహ్ తక్ జైలులో దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. జైలు కెళ్లిన తొలినాళ్లలో అన్నింటికీ మొరాయించినా.. గత్యంతరం లేకపోవడంతో కూరగాయల తోటలో పనిస్తున్నాడు. అందరి ఖైదీల్లాగే రోజుకు 8 గంటల పనిచేస్తున్న డేరాబాబాకు రోజుకు 20 రూపాయలు కూలీ ఇస్తున్నారు. చివరికి.. ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చినట్టు తయారైంది ప్రస్తుతం డేరా బాబా జీవితం.

ఇన్నాళ్లూ సకల భోగాలు...

ఇన్నాళ్లూ సకల భోగాలు...

సుమారు 800 ఎకరాల్లో తనకు నచ్చినట్టు నిర్మాణాలు సకల సౌకర్యాలతో నిర్మించుకుని గుర్మీత్ ఇన్నాళ్లూ ఎంజాయ్ చేశాడు. సందర్శకుల రాకపోకలతో సిర్సాలోని డేరా ప్రాంగణం తిరునాళ్లను తలపించేంది. ఈఫిల్ టవర్, తాజ్‌మహాల్, డిస్నీలాండ్, మొగల్ దర్భార్‌లను తలదన్నే కట్టడాలు డేరా ప్రాంగణంలో కొలువుదీరాయి. డేరా ప్రాంగణంలోకి వెళ్లేముందు అదిరిపోయే ద్వారం నిర్మించుకున్నాడు. అలాగే ఓ పెద్ద గోడపై గిన్నీస్ అవార్డు గ్రహీతలకు స్వాగతం పలుకుతూ చిత్రాలు నిర్మించుకున్నాడు.

లోలోపల ఎన్ని చేసినా.. పైకి మాత్రం...

లోలోపల ఎన్ని చేసినా.. పైకి మాత్రం...

డేరా లోపల ఏం జరుగుతోందనేది తెలియకుండా పైకి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేవాడు. మొక్కలు నాటడం, వీధులు ఊడ్చే పనులు, రక్తదాన శిబిరాలు నడిచేవి. తన సినిమాల షూటింగ్ కోసం ఏకంగా ఫిల్మ్‌సిటీనే నిర్మించుకుని, ప్రాంగణం చుట్టూ విద్యుత్ తీగలతో కంచె ఏర్పాటు చేయించుకున్నాడు. ఫిట్‌నెస్ సెంటర్లు, థియేటర్లు, పబ్‌లలో ఉల్లాసంగా గడిపేసిన గుర్మీత్ ప్రస్తుతం సునారియా జైలు గదిలో దిగాలుగా గడుపుతున్నాడు.

సాధారణ ఖైదీ జీవితమే...

సాధారణ ఖైదీ జీవితమే...

గుర్మీత్‌ జైలు జీవితంపై జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్‌ కొన్ని వివరాలు తెలిపారు. గుర్మీత్ జైలులో సాధారణ ఖైదీగానే ఉన్నాడని, ఆయన సెల్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారని చెప్పారు. డేరా బాబా దగ్గర రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, దుస్తులు మాత్రమే ఉన్నాయన్నారు. గుర్మీత్ కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని, ఆయనకు కనీసం టీవీ, పత్రికలు కూడా అందుబాటులో లేవని, ఫోన్ సౌకర్యం కూడా కల్పించలేదని కేపీ సింగ్ చెప్పారు. జైలులో గుర్మీత్ కు నైపుణ్యం లేని వృత్తిని అప్పగించామని, రోజూ 8 గంటల పాటు కూరగాయలు, ఎండు ద్రాక్ష తోటల్లో పని చేస్తున్నాడని వివరించారు.

English summary
The jailed head of the Rs 1,100-crore empire called Dera Sachcha Sauda, Gurmeet Ram Rahim, will now toil eight hours every day to earn a measly Rs 20. The dera chief is serving time in Rohtak's Sunaria jail after being convicted for raping two disciples almost 18 years ago. Godman Gurmeet Ram Rahim has been brought to his knees, literally, as his tasks now include pruning trees and cultivating a 500-600 yard patch of land inside Rohtak's Sunaria prison. The vegetables grown by him will not be sold outside but, cooked in the jail mess after a thorough inspection. Dera Sacha Sauda chief's many 'talents' like acting and singing among others failed to qualify him as a skilled worker, (which could earn him more wages in prison) thereby pushing him in to the category of an unskilled worker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X