World population day: ప్రశ్నార్ధకంగా మానవ మనుగడ!!
జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాము. ప్రపంచ జనాభా సమస్యలు మరియు సమాజంపై జనాభా పెరుగుదల ప్రభావం గురించి అవగాహన కల్పించడం కోసం ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము. భూమి మీద జనాభా భారం పెరుగుతున్న కొద్దీ మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. జనాభా పెరుగుదల ప్రభావాలని గుర్తించి పరిష్కారం అన్వేషించే అవగాహన కోసమే జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ప్రపంచ జనాభా దినోత్సవం ఇందుకే
ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్యంగా కుటుంబ నియంత్రణ, జనాభా పెరగడం కారణంగా చోటుచేసుకుంటున్నటువంటి ఆందోళనలు, వాటిని పరిష్కరించటం మొదలైన విషయాలను నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవడంతోపాటు, మన భూమిని కాపాడుకోవలసిన అవసరాన్ని తెలియజేయడం కోసం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది.

ప్రపంచ జనాభా దినోత్సవం ప్రారంభం అప్పుడే.. ఎందుకంటే
జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడుతున్న సవాళ్లు ఆ సవాళ్లను పరిష్కరించుకోవడానికి తెలుసుకోవలసిన చర్యలను చర్చించేందుకు ఈరోజు ఒక వేదికను అందిస్తుంది ఐక్యరాజ్యసమితి. అన్ని దేశాలకు ప్రపంచ జనాభా దినోత్సవం ద్వారా అవగాహనను, సహకారాన్ని పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ప్రపంచ జనాభా దినోత్సవం ఐక్యరాజ్యసమితి. 1989లో మొదటిసారిగా నిర్వహించింది 1987 జులై 11వ తేదీన ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సంవత్సరం థీమ్ ఇదే
పర్యావరణ సుస్థిరతను సామాజిక ఆర్థిక అభివృద్ధిని జనాభా పెరుగుదల నియంత్రణను లక్ష్యంగా చేసుకొని ప్రజలలో అవగాహన పెంచటానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 2024 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ గా జనాభా గణనలో ప్రతి ఒక్కరిని లెక్కించండి.. ఎవరిని వదిలిపెట్టొద్దు అంటూ పేర్కొంది ఐక్యరాజ్యసమితి.
ఈ సంవత్సరం జనాభా దినోత్సవం సందర్భంగా యూఎన్ ఏం చెప్పిందంటే
పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా ఏర్పడుతున్న పర్యావరణ మరియు ధరిత్రీ సమస్యలను పరిష్కరించడానికి, పెరుగుతున్న జనాభాతో వచ్చినటువంటి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ డేటా సేకరణ యొక్క ప్రాముఖ్యతను ఈ సంవత్సరం థీమ్ హైలైట్ చేస్తోంది. ప్రపంచ స్థిరమైన ప్రగతి కోసం ఆర్థిక పెట్టుబడి కూడా అవసరమైనదేనని, పెరుగుతున్న జనాభాకు తగినట్టు పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక పెట్టుబడిని కూడా పెట్టాల్సిన అవసరాన్ని ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ప్రస్తావిస్తోంది.












Click it and Unblock the Notifications