యడ్యూరప్పకు మరో ఛాన్స్ ?-సీఎంగా కొనసాగే అవకాశం-కర్నాటకలో మారుతున్న రాజకీయం
కర్నాటక సీఎం పదవి నుంచి యడియూరప్పను తప్పించే విషయంలో తీవ్ర మల్లగుల్లాలు పడిన బీజేపీ అధిష్టానం చివరికి ఆయన్ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న యడియూరప్ప భవిష్యత్తు ఇవాళ తేలుతుందన్న అంచనాల మధ్య బీజేపీ హైకమాండ్ ఈ మేరకు ఆయనకు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కర్నాటకలో సీఎం పదవి మార్పు ఊహాగానాలతో నెలకొన్న ప్రతిష్టంభనకు చరమగీతం పాడేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. తన భవిష్యత్తుపై ఇవాళ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయడం లేదా తనకు క్లారిటీ ఇస్తుందని యడియూరప్ప స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే అధిష్టానం కోరిన విధంగా తాను సీఎం పదవి వదులుకునేందుకు సిద్ధమని కూడా ప్రకటించిన యడియూరప్ప.. అంతర్గతంగా అధిష్టానంపై కుల రాజకీయాలపై ఒత్తిడి పెంచినట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పుడున్న పరిస్ధితుల్లో యడ్డీని కొనసాగించేందుకే అధిష్టానం మొగ్గు చూపుతోంది.

Recommended Video
ఇవాళ్టితో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతోంది. ఇలాంటి సమయంలో యడ్డీకి బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు అధిష్టానం ఇష్టపడటం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వం రెండేళ్ల పాలన సంబరాలు చేసుకుంటోంది. ఇవాళ హైకమాండ్ నుంచి తనకు సమాచారం వస్తుందని, ఆ తర్వాత తన నిర్ణయం తాను తీసుకుంటానని యడియూరప్ప చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్జా యడియూరప్పకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. తాజాగా జేపీ నడ్డా ప్రెస్ మీట్లోనూ కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications