Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘నువ్వు విన్ సన్‌వి’! కరుణానిధి మాటను నిజం చేసిన లాయర్ విల్సన్

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా.

కాగా, కరుణానిధి తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది పేరు విల్సన్‌. ఆయన డీఎంకే పార్టీకు సీనియర్‌ అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నారు. కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌ వద్ద నిర్వహించాలని వాదించి గెలిచిన విల్సన్‌ను గతంలో కరుణానిధి పలుమార్లు మెచ్చుకున్నారు.

you are not wilson.. you are winson: those words by Karunanidhi comes true about dmk lawyer

ఓసారి 'కళైంజ్ఞర్‌' కరుణానిధి ఆయననుద్దేశించి ఒక మాట అన్నారట. 'నువ్వు విల్సన్‌వి కావు. 'విన్'‌సన్‌వి' అనేవారట. ఆయన మాటలు నిజమేనని విల్సన్ ఈ కేసును గెలిచి మరోసారి రుజువు చేశారు. ‌ఈ విషయాన్ని చిత్రవర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి.

Recommended Video

    ఇదీ క‌ళైంగ‌ర్‌ క‌రుణానిధి కుటుంబం: అన్నదమ్ముల బలం ఎంతకాలం నిలబడునో???

    కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించడంతో దీనిపై డీఎంకే మంగళవారం రాత్రే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లోనే నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+