షాక్: డేరాబాబా, హనీప్రీత్‌కు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం!
డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌లకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపడం విశేషం.
న్యూఢిల్లీ: డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌లకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపడం విశేషం. 'టాయిలెట్ డే' ప్రచారంలో భాగస్వాములు కావాలంటూ వారిద్దరినీ ఆహ్వానించింది ఐరాస. ఈ మేరకు ఐరాస తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

ఐరాసకే తెలియకే..
అయితే, డేరాబాబాతోపాటు హనీప్రీత్‌లు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి ఇంకా తెలియనట్లుంది. అందుకే నవంబర్ 19న ప్రపంచ ‘టాయిలెట్ డే'ను జరుపుతారనీ.. ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఐరాస వాటర్ బాడీ.. గుర్మీత్‌ను మంగళవారం ట్విట్టర్ ద్వారా కోరింది.
Recommended Video


హనీప్రీత్‌కు నేడు..
కాగా, గుర్మీత్‌కు జైలు శిక్ష పడటంతో ఆయన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మరోసారి ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌కు ట్విట్టర్ ద్వారా ఆహ్వానం పంపింది ఐరాస

మద్దతు ఇస్తారంటూ..
‘డియర్ హనీప్రీత్.. వరల్డ్ టాయిలెట్ డేకు మీరు, గుర్మీత్ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం' అంటూ ఐరాస వాటర్ ట్వీట్ చేసింది. కాగా.. హనీప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన రోజే ఐరాస ఈ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ ట్వీట్లకు డేరా మద్దతుదారులు సంబరపడిపోతుంటే.. ఇతర నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.

హనీప్రీత్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20ఏళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. డేరాబాబాకు సహాయంగా ఉన్న హనీప్రీత్ ఇన్సాన్‌పై.. అతడ్ని జైలు నుంచి తప్పించే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం హనీప్రీత్ ను పోలీసులు అరెస్ట్ చేసి డేరాబా అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు.
కాగా, నెటిజన్ల విమర్శల నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా విషయం తెలుసుకున్న ఐరాస.. తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications