అద్దె ఎక్కువగా ఉందని ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?
నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడం, విద్య కోసం రావడం వంటి కారణాల వల్ల ఇంటికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ కి తగ్గట్టు సరఫరా లేకపోవడం వల్ల అద్దెలు పెరుగుతాయి.కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు వంటివి ఉండడం వల్ల అక్కడ అద్దెలు ఎక్కువగా ఉంటాయి.అద్దెలు పెరగడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. అద్దె ఖర్చులు పెరిగిపోవడంతో చాలామంది యువత ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చైనాలోని హునాన్‌కు చెందిన ఓ యువతి (18) కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. దీంతో ఆ యువతి వినూత్నంగా ఆలోచించింది.
ఆ యువతి ఉంటున్న ఇల్లు అద్దె అధికంగా ఉండటంతో ఏకంగా ఆఫీస్‌లోనే ఉండిపోయింది.ఆమె ఒక ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తుంది. నెలకు దాదాపు రూ. 31,800 జీతం వస్తుంది. అయితే, అద్దె ఖర్చులు అధికంగా ఉండడంతో, ఆమె తన జీతంలో ఎక్కువ భాగం అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. దీంతో, ఆమె తన కంపెనీలోని రెస్ట్‌రూమ్‌ను తన నివాస స్థలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.ఆమె ఆఫీసులోని బాత్రూంలో నివసించడానికి తన యజమాని భార్యతో మాట్లాడింది.

బాత్రూంలో తన బట్టలు ఉతకడం, భవనం పైకప్పుపై ఆరబెట్టడం చేస్తుంది.బాత్రూంలో ఉంటున్న ఆమె నిద్రపోతున్నప్పుడు దుర్వాసన రాకుండా ఉండటానికి టాయిలెట్‌ను శుభ్రం చేస్తుంది.ఆమె ప్రత్యేకమైన జీవన పరిస్థితి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఇలా ఆఫీసులోనే ఉండటం వలన ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సరైన నివాస స్థలం లేకపోవడం వలన, ఆమె ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.ఈ సంఘటన ద్వారా, ప్రస్తుతం అద్దె ఖర్చులు ఎంతలా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications