Young woman: యువతి మీద రేప్, బెయిల్ మీద వచ్చి మళ్లీ అదే మహిళ మీద రేప్, ఏం చేస్తావు ?
జైపూర్: మహిళ మీద కన్ను వేసిన కామాంధుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చాలా కాలం ఆమె వెంట తిరిగిన ఆ వ్యక్తి ఆమె లొంగకపోవడంతో రగిలిపోయాడు. చివరికి ఊరిబయట ఒంటరిగా చిక్కిన మహిళను నిర్జనప్రదేశంలోకి లాక్కెళ్లిన ఆమె మీద అత్యాచారం చేశాడు. రేప్ కేసులో అరెస్టు అయిన కామంధుడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ ఆదే మహిళ మీద అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.

కామాంధుడు
రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని బాగ్రూ ప్రాంతంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో బేబి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. బేబీ మీద కన్ను వేసిన కామాంధుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చాలా కాలం బేబీ వెంట తిరిగిన ఆ వ్యక్తి ఆమె లొంగకపోవడంతో రగిలిపోయాడు.

రేప్ చేసి జైలుల్లో చిప్పకూడు
ఎంతకాలానికి బేబీ తనకు లొంగలేదని, ఆమెకు తగిన బుద్ది చెప్పాలని రాకేష్ సమయం కోసం వేచి చూశాడు. ఓ రోజు ఊరిబయట ఒంటరిగా చిక్కిన మహిళను నిర్జనప్రదేశంలోకి లాక్కెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో స్థానిక పోలీసులు రాకేష్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

బుద్దిమారలేదు..... మళ్లీ అదే మహిళ మీద రేప్
అత్యాచారం కేసులో అరెస్టు అయిన రాకేష్ చాలా కాలం నుంచి జైల్లో ఉన్నాడు. బంధువులు బెయిల్ ఇవ్వడంతో ఇటీవల రాకేష్ జైలు నుంచి బయటకు వచ్చాడు. తన మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టించిన బేబీ మీద రాకేష్ పగపెంచుకున్నాడు. మళ్లీ ఊరిబయట కనపడిన బేబీని ఎత్తుకెళ్లిన రాకేష్ ఆమె మీద రెండోసారి అత్యాచారం చేసి పరారైనాడు.
Recommended Video

కేసు పెట్టిన మహిళ మీద పగ
తన మీద రేప్ కేసు పెట్టిన మహిళ మీద మళ్లీ కామాంధుడు రేప్ చేసి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని కార్నాని పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ బాహ్నా చెప్పారని స్థానిక మీడియా తెపింది. ఒకే మహిళ మీద రెండు సార్లు అత్యాచారం చేసి పరారైన కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications