ఒకే యువతికి ఇద్దరు యువకులతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి, షాక్ ఇచ్చారు!

Recommended Video

    ఒకే యువతికి ఇద్దరు యువకులతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి

    బెంగళూరు: ఒకే యువతికి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇద్దరు యువకులతో వివాహం చేసిన విచిత్ర ఘటన వెలుగు చూసింది. తన భార్యను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారని, సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది నిర్లక్షం వలన తనకు అన్యాయం జరిగిందని మొదటి భర్త ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. యువతి మొదటి భర్త సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో, ఆమెతో తీసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

    ప్రేమ వివాహం

    ప్రేమ వివాహం

    ఉత్తర కన్నడ జిల్లా ఆంకోళ తాలుకా సుంకసాళ నివాసి గణపతి భట్, యల్లాపుర యువతి (21) ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెద్దలకు తెలీకుండా 2017 ఆగస్టు 15వ తేదీన స్నేహితుల సమక్షంలో కారవార తాలుకా, ఆమదళ్ళిలోని శ్రీ వీరగణపతి దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

    ప్రేమికుల పెళ్లి

    ప్రేమికుల పెళ్లి

    2018 ఫిబ్రవరి 7వ తేదీ గణపతి భట్, యువతి కారవార సబ్ రిజిస్టర్ కార్యాలయం చేరుకుని అధికారుల సమక్షంలో పూల దండలు మార్చుకుని అధికారికంగా వివాహం రిజిస్టర్ చేయించారు. ఆ సమయంలో యువతి తాను యల్లాపుర పట్టణంలోని ఉద్దజడ్డి వీదిలోని కంప్లి అంతలు ప్రాంతంలో నివాసం ఉంటున్నానని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చిరునామా ఇచ్చింది.

    ఉద్యోగం కోసం బెంగళూరు

    ఉద్యోగం కోసం బెంగళూరు

    కొతం కాలం పాటు గణపతి భట్ దంపతులు కాపురం చేశారు. కాలేజ్ రోజుల నుంచి ప్రేమించుకోవడంతో భార్య మీద గణపతి భట్ కు ఎలాంటి అనుమానం రాలేదు. ఉద్యోగం కోసం తాను బెంగళూరు వెలుతున్నానని, కొద్ది రోజులు నీవు పుట్టింటిలో ఉండాలని, తరువాత పిలుచుకుని వెలుతానని గణపతి భట్ భార్యకు చెప్పాడు. తరువాత గణపతి భట్ బెంగళూరు చేరుకుని ఉద్యోగ వేటలో నిమగ్నం అయ్యాడు.

    రెండో పెళ్లి చేసుకుంది

    రెండో పెళ్లి చేసుకుంది

    భర్త గణపతి భట్ బెంగళూరులో ఉండటంతో యువతికి అతని మీద ప్రేమ తగ్గిపోయినట్లు ఉంది. పెద్దలు చెప్పారని 2018 జులై 19వ తేదీన యల్లాపుర తాలుకా తారమనేలో నివాసం ఉంటున్న రాజేష్ భట్ ను యువతి పెళ్లి చేసుకుంది. జులై 23వ తేదీన యల్లాపుర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాజేష్ భట్, యువతి దండలు మార్చుకుని అధికారికంగా పెళ్లి రిజిస్టర్ చేయించారు. ఆ సమయంలో యువతి యల్లాపుర పట్టణంలోని ఉద్దజడ్డి వీది, కంప్లీ ప్రాంతంలో నివాసం ఉంటున్నానని చిరునామా ఇచ్చారు.

    రెండో భర్త విందు

    రెండో భర్త విందు


    పెళ్లి చేసుకున్న సందర్బంగా రాజేష్ భట్ బంధువులు, స్నేహితులకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. 2018 ఆగస్టు 5వ తేదీ ఆదివారం (మూడు రోజుల క్రితం) గజానన మారుతి దేవాలయం ఆవరణంలో విందు ఏర్పాటు చేశాడు. రాజేష్ భట్ ఆహ్వానపత్రికలు పంచిపెట్టాడు. ఈ విషయం యువతి మొదటి భర్త గణపతి భట్ కు తెలిసి షాక్ కు గురైనాడు.

    మోసం చేశారు

    మోసం చేశారు

    తన భార్యను గుట్టుచప్పుడు కాకుండా రాజేష్ భట్ తో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేశారని, తనను మోసం చేశారని గణపతి భట్ ఓ వీడియో తీసి, పెళ్లి సమయంలో, కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతితో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. యువతి తనతో విడాకులు కూడా తీసుకోలేదని, మీరే న్యాయం చెయ్యాలని గణపతి భట్ దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+