Kidnap: విదేశీ కుక్క మీద మోజు, కుక్క యజమానిని కిడ్నాప్ చేసి ఏమి అడిగారంటే ?, దేవుడా !
నోయిడా/లక్నో: ప్రముఖ ఐటీ కంపెనీలో ఉన్న ఏరియా సమీపంలో ఇద్దరు సోదరులు నివాసం ఉంటున్నారు. సోదరులు ఖరీదైన విదేశీ జాతి కుక్కలు పెంచుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోదరుడిని కొందరు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి సోదరుడికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు వారి డిమాండ్ చెప్పడంతో అతని సోదరుడు బిత్తరపోయాడు. కిడ్నాపర్లు ఏమి అడిగారు అనే విషయం ఆ యువకుడు చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

విదేశీ జాతి కుక్కలు
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని అల్ఫా 2లో రాహుల్ ప్రతాప్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాహుల్ ప్రతాప్ ఇంటి సమీపంలో అతని సోదరుడు శుభం నివాసం ఉంటున్నాడు. శుభం రెండు విదేశీ జాతి కుక్కలను పెంచుకుంటున్నాడు. అందులో శుభం రూ. 1.50 లక్షలు ఇచ్చి జర్మనీ నుంచి మంచి జాతి కుక్కను తెప్పించుకున్నాడు.

రోడ్డు మీద ఫ్రెండ్ కలిశాడు
శుభం ఇంటిలో ఉన్న విదేశీ కుక్కలను అతని సోదరుడు రాహుల్ ప్రతాప్ అప్పుడప్పుడు అతని ఇంటికి పిలుచుకుని వెళ్లడం, వాటికి వాకింగ్ చేయించడం చేస్తున్నాడు. ఇంటి నుంచి రాహుల్ ప్రతాప్ జర్మీని కుక్కను పిలుచుకుని బయటకు వెళ్లాడు. అం సందర్బంలో రాహుల్ కు పరిచయం ఉన్నప ప్రవీణ్ కుమార్ కనపడటంతో ఇద్దరు మాట్లాడుకున్నారు.

కుక్క కోసం దాని యజమాని కిడ్నాప్
తరువాత ప్రవీణ్ కుమార్ స్నేహితులు లలిత్, మోటీ అక్కడికి వెళ్లారు. తరువాత ప్రవీణ్ కుమార్ అతని స్నేహితులు కుక్కను బలవంతంగా లాక్కొని వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సాధ్యం కాకపోవడంతో కుక్కను వదిలేసిన ప్రవీణ్, అతని స్నేహితులు రాహుల్ ప్రతాప్ ను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.

నవ్వాలో... ఏడవాలో తెలీక ?
రాహుల్ సోదరుడు శుభంకు ఫోన్ చేసిన ప్రవీణ్ నీ సోదరుడు ప్రాణాలతో ఇంటికి రావాలంటే నీ దగ్గర ఉన్న జర్మనీ కుక్కను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల వింతకోరికతో హడలిపోయిన శుభం గ్రేటర్ నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మీద శుభం పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న కిడ్నాపర్లు మరుసటి రోజు రాహుల్ ప్రతాప్ ను నోయిడా సమీపంలోని నిర్జనప్రదేశంలో వదిలేసి అతని మొబైల్ ఫోన్ లాక్కొని పరారైనారు. విదేశీ కుక్క కోసం ఓ యువకుడిని కిడ్నాప్ చేశారని వెలుగు చూడటం నోయిడాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇలాంటి కేసు నమోదు అయినందుకు నోయిడా పోలీసులు నవ్వాలో, ఎడవాలో తెలీక జుట్టు పీక్కుంటున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications