పోలీస్ స్టేషన్ లో ఫుల్ కోటింగ్, నోటిలో నురుగ వచ్చే వరకు, యోగి అడ్డాలో !

లక్నో/ఉత్తరప్రదేశ్: జూదం ఆడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జూదంతో పాటు గంజాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న వారి మీద, చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న వారి మీద, అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్న వారి మీద పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లాలోని రౌతల్ గ్రామంలో తోటలో జూదం ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వెళ్లే సమయానికి అక్కడ ఉన్న యువకులు పారిపోయారు. యువకులను వెంబడించిన పోలీసులు సాజిద్ అబ్బాస్ (28) అనే యువకుడిని పట్టుకున్నారు.

gambling case

సాజిద్ అబ్బాస్ ను ఖేక్రా పోలీస్ స్టేషన్ చెక్ పోస్టులోకి పిలుచుకుని వెళ్లి విచారణ చేశారు. కొన్ని గంటల తరువాత సాజిద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన పోలీసులు మీ అబ్బాయి జూదం ఆడుతున్నట్లు మా దగ్గర ఎలాంటి సాక్షాలు లేవని, మీరు వెంటనే వచ్చి పిలుచుకుని వెళ్లాలని చెప్పారు. వెంటనే సాజిద్ తండ్రి బాబు అబ్బాసీ పోలీస్ చెక్ పోస్టు దగ్గరకు వెళ్లాడు.

తాను పోలీస్ చెక్ పోస్టు దగ్గరకు వెళ్లే సమయానికి తన కొడుకు సాజిత్ నోటిలో నురుగు వస్తోందని, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించామని అతని తండ్రి బాబు అబ్బాసీ అన్నారు. అయితే చికిత్స విఫలమై సాజిద్ చనిపోయాడు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వలనే సాజిద్ చనిపోయాడని అతని తండ్రి బాబు అబ్బాసీ ఆరోపించారు.

సాజిద్ కు జూదం ఆడే అలవాటు లేదని, కావాలనే పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తన సోదరుడు తప్పు చెయ్యలేదని ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, ముగ్గురు పోలీసులు కనికరం లేకుండా తన తమ్ముడిని చితకబాదేశారని, కస్టడీలోనే తన తమ్ముడిని కొట్టి చంపేశారని సాజిద్ సోదరుడు మోహమ్మద్ వాజిద్ ఆరోపించాడు.

gambling case

పోలీసుల అదుపులో ఉన్న తన సోదరుడు సాజిద్ ను తాము అదుపులోకి తీసుకున్న అర్దగంటలోనే అతను చనిపోయాడని సాజిద్ సోదరుడు మోహమ్మద్ వాజిద్ ఆరోపించాడు. సాజిద్ మీద దాడి చేశారని ఆరోపణలు రావడంతో ఒక పోలీసును విధుల నుంచి తప్పించామని, కేసు విచారణ జరుగుతోందని, పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని బాగ్ పత్ ఏఎస్పీ మనీష్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు. పేకాట ఆడుతున్నారని ఒక్క కారణంతోనే ఓ యువకుడిని పోలీసులు కొట్టి చంపేశారని ఆరోపణలు రావడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+