యాసిడ్ పోసి చంపేస్తామని హీరోయిన్ కు వార్నింగ్: వ్యాపారవేత్త, కొడుకు అరెస్టు, తల్లి, కూతురిపై చీటింగ్

చెన్నై: పెళ్లి చేసుకోకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని ప్రముఖ హీరోయిన్ ను బెదిరించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకును చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ తమిళ హీరోయిన్ శృతి మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని బెదిరించారని ఆమెతల్లి, నటి చిత్ర ఫిర్యాదు చెయ్యడంతో చెన్నైలోని మైలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తమిళ నటి శృతిని బెదిరించారని ఆరోపిస్తూ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖరన్, ఆయన కుమారుడు అముదాన్ వెంకటేశన్ లను మైలాపూర్ మహిళా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు.

దూరపు బంధువు

దూరపు బంధువు

తమిళ నటి చిత్రకు సమీప బంధువు రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖరన్. చిత్ర కుమార్తె, తమిళ నటి శృతి కాలేజ్ లో చదువుకునే రోజుల్లో అముదాన్ వెంకటేశన్ ప్రేమించాడని తెలిసింది. అయితే సమీప బంధువు అయిన అముదాన్ వెంకటేశన్ ను నటి శృతి ప్రేమించలేదని సమాచారం.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి?

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి?

తన కుమారుడు అముదాన్ వెంకటేశన్ ను వివాహం చేసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజశేఖరన్ నటి శృతి, ఆమె తల్లి చిత్ర మీద ఒత్తిడి చేశారని తెలిసింది. రాజశేఖరన్ తో పాటు ఆయన కుమారుడు అముదాన్ వెంకటేశన్ సైతం తనను ప్రేమించాలని, తననే పెళ్లి చేసుకోవాలని నటి శృతిని తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

నో చెప్పినందుకు నటికి వార్నింగ్!

నో చెప్పినందుకు నటికి వార్నింగ్!

అముదాన్ వెంకటేశన్ ను పెళ్లి చేసుకోవడానికి నటి శృతి నిరాకరించింది. తన కుమార్తె శృతిని అముదాన్ వెంకటేశన్ వివాహం చేసుకోవడానికి తాను అంగీకరించనని ఆమె తల్లి చిత్ర తేల్చి చెప్పింది. ఈ విషయంపై నటి శృతి, ఆమె తల్లి చిత్ర మీద అముదాన్ వెంకటేశన్ కక్ష పెంచుకున్నాడని తెలిసింది.

విదేశాల నుంచి వస్తే యాసిడ్ దాడి!

విదేశాల నుంచి వస్తే యాసిడ్ దాడి!

ఇటీవల నటి శృతి విదేశాలకు వెళ్లింది. నువ్వు విదేశాల నుంచి చెన్నై వచ్చిన తరువాత నన్ను వివాహం చేసుకోవాలని, లేదంటే నీ మీద యాసిడ్ దాడి చేసి చంపేస్తామని అముదాన్ వెంకటేశ్ బెదిరించాడని తెలిసింది. కొడుకు అముదాన్ వెంకటేశన్ కు ఆయన తండ్రి రాజశేఖరన్ మద్దతు ఇచ్చాడని, మాకు చాల భయంగా ఉందని ఆమె తల్లి చిత్ర చెన్నైలోని మైలాపూర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మైలాపూర్ మహిళా పోలీసులు మహిళలను చంపేస్తామని బెదిరించారని, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారని, మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసి రాజశేఖరన్, ఆయన కుమారుడు అముదాన్ వెంకటేశన్ లను అరెస్టు చేశారు.

తల్లి, కూతురి మీద చీటింగ్ కేసులు

తల్లి, కూతురి మీద చీటింగ్ కేసులు

గతంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నటి శృతి అనేక మందిని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో నటి శృతితో పాటు ఆమె తల్లి చిత్రను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తల్లి చిత్ర, కుమార్తె శృతి మీద అనేక మంది ఆరోపణలు చేశారు. తన తండ్రికి అనారోగ్యంగా ఉందని కోయంబత్తూరుకు చెందిన బాలమురగన్ దగ్గర రూ. 45 లక్షలు తీసుకుని మోసం చేసిందని నటి శృతి మీద కేసు నమోదు అయ్యింది. బాలమురుగన్ కేసు పెట్టడంతో నటి శృతి, ఆమె తల్లి చిత్ర మీద కేసులు నమోదు అయ్యాయి. నటి శృతి నటించిన సినిమాలు హిట్ కాలేదు. అందుకే ఆమె ఇలా పలువురిని మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+