పంజాబ్ సిఎం బాదల్‌పైకి బూటు విసిరిన యువకుడు

Youth throws shoe towards Parkash Singh Badal
లూథియానా: పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్‌లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది.

కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువకుడిని బర్నాలాలోని దనైలా ప్రాంతానికి చెందిన విక్రమ్‌గా గుర్తించినట్లు ఖానా ఎస్ఎస్‌పి హర్ష బర్నాలా తెలిపారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్పందిస్తూ.. యువకుడిని క్షమించి వదిలేయమన్నారు.

రాజకీయ నాయకులు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిస్తున్నారే తప్ప వాటిని నెరవేర్చడం లేదని.. అందుకే తప్పుడు వాగ్ధానాలు చేసే నాయకులకు తాను వ్యతిరేకమని బూటు విసిరిన యువకుడు విక్రమ్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+