ఆ అవకాశం పెద్దిరెడ్డికే.. మరే నేతకు దక్కదు ఆ సువర్ణావకాశం.. రఘురామ హాట్ కామెంట్స్
వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నిత్యం ఏదో ఒక ఇష్యూ మాట్లాడుతూనే ఉంటారు. ప్రతీ కాంట్రవర్సీ అంశాన్ని నానా రచ్చ చేస్తారు. ఇవాళ కూడా అలాంటి తేనేతుట్టేను కదిపారు. జగన్ జైలుకెళితే తదుపరి సీఎం ఎవరూ అనే అంశాన్ని రఘురామ ప్రస్తావించారు. అయితే అంచనాలు తలకిందులు అయ్యేలా.. కొత్త నేత పేరును ప్రస్తావించారు. దీంతో రఘురామ కామెట్స్ సర్వత్రా చర్చానీయాంశమయ్యాయి.

వైసీపీలో అంతర్గతంగా ఏదో..?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తోంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడైనా సీఎం జగన్‌పై అసమ్మతి నేతలు, సీనియర్ నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేయబోతున్నారని రిపబ్లిక్ టీవీలో కథనం ప్రసారం అయిన సంగతి తెలిసిందే. తర్వాత సీనియర్ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అందరూ తమనే సీఎం పదవి వరిస్తుందని అనుచరుల చేత ప్రచారం చేయించుకుంటున్నారు.

నేనే సీఎం అయితే
ఇందులో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు వరసలో ఉన్నారు. అంతేకాదు తానే ముఖ్యమంత్రి అయితే అంటూ ప్రకటన కూడా చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీంతో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమా? సీఎం జైలుకు వెళితే మంత్రి పెద్దిరెడ్డే సీఎం అభ్యర్థా? అంటే అవుననే అంటున్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వైసీపీలో ముసలం ప్రారంభమైందనే కథనాలను.. సీఎం కావాలనుకునేవారే ప్రచారం చేయించి ఉండవచ్చునని రఘురామ కృష్ణరాజు బలమైన వాదన.

రెఫరెండం మాత్రం కాదు
మున్సిపల్ ఎన్నికలు జగన్ పాలనకు రిఫరెండం కాదని రఘురామ అన్నారు. వైసీపీకి ఉన్న ధన, స్వర బలంతో ప్రజలు ఓట్లు వేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశమే లేదన్నారు. సీఎం జగన్ మాటే చెల్లుతుందన్నారు. అయితే నిన్న మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ తానే ముఖ్యమంత్రిని అయితే ప్రతిపక్షం లేకుండా చేసేవాడినని అన్నారంటే తప్పకుండా ఆలోచించాల్సిన విషయమన్నారు. పెద్దిరెడ్డికి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. పెద్దిరెడ్డి విద్యాధికుడు, ధనవంతుడు, బలవంతుడని రఘురామ కృష్ణంరాజు కామెంట్ చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications