ప్రధాని మోడీకి యూనస్ ఖాన్ ఫోన్: బంగ్లాలో హిందువులపై కీలక హామీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై హత్యాచారాలు కొనసాగుతున్న నేపథ్యంతో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అంశంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ఖాన్ ఫోన్ చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని యూనస్‌ఖాన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు.

ప్రొఫెసర్‌ యూనస్‌ ఖాన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఎక్స్‌(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ కోసం భారత దేశ మద్దతు కొనసాగుతుందని యూనస్‌కు స్పష్టం చేసినట్లు మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిని మోడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Yunus Khan calls PM Modi Key assurance on protection of Hindus in Bangladesh

హింస నెలకొన్న బంగ్లాదేశ్‌లో జనజీవనం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు ప్రధాని మోడీ. పొరుగుదేశంలో ఉన్న హిందువులు ఇతర మైనారిటీలు దాడులకు గురవడంపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల సురక్షితను భారత్‌ కోరుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలోనే యూనస్‌ఖాన్‌ ప్రధాని మోడీకి ఫోన్‌ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించడం గమనార్హం.

బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని యూనస్ ఖాన్.. మోడీకి తెలిపారు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందని చెప్పారు. శనివారం వర్చువల్​‌గా జరగనున్న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో పాల్గొనాలన్న మోడీ ఆహ్వానానికి యూనస్ అంగీకరించారు. యూనస్‌ ఖాన్​ ఇటీవల మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న దాడులపై ఓ కార్యక్రమంలో స్పందించారు. హక్కులు అందరికీ సమానమని, మానవులంతా ఒకటేనని తెలిపారు. మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషులమేనని అన్నారు. ఇప్పుడు మోదీకి ఫోన్​​ చేసి హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ విషయంపై హామీ ఇచ్చారు.

కాగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది. దీంతో నాటి ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూనస్‌ ఖాన్​ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా, యూనస్ ప్రభుత్వం మరో నలుగురు సలహాదారులను నియమించుకుంది. దీంతో మొత్తం సలహాదారుల సంఖ్య 21కి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+