మీ నీడ మీకు కనిపించని రోజు: ఇంకొన్ని గంటలే..!!
బెంగళూరు: ఇవ్వాళ- జీరో షాడో డే. మీ నీడ మీకు కనిపించకుండా పోతుంది. కొన్ని నిమిషాల పాటు నీడం మాయం అవుతుంది. దాన్ని స్వయంగా మనం పరీక్షించుకోవచ్చు కూడా. ఖగోళపరంగా ఇదో అద్భుతం. ఈ సందర్భం కోసం అటు ఖగోళ పరిశోధకులు కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 17 నిమిషాలకు ఈ అద్భుతం ఆవిష్కృతమౌతుంది. సూర్యుడు నడినెత్తిన వచ్చినప్పుడు మన నీడ భూమి అసలు పడదు. 12:17 నిమిషాలకు సూర్య కిరణాలు నిట్ట నిలువుగా ఈ నగరాన్ని తాకడమే దీనికి కారణం. ఏ వస్తువు నీడ కూడా భూమిపై పడదు. సంవత్సరానికి రెండుసార్లు ఈ జీరో షాడో రోజు ఏర్పడుతుంది.

కర్కాటక రాశి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడని, ఆ సమయంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని తాకుతాయని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేబిప్రసాద్ దురై తెలిపారు. ఇలాంటి సందర్భం సంవత్సరంలో రెండుసార్లు ఏర్పడుతుంది. ఉత్తరాయణ-దక్షిణాయన సమయంలో సూర్యకిరణాలు నిలువువగా ప్రసరిస్తాయని వివరించారు. భూ భ్రమణ అక్షం సూర్యుడు, దాని కక్ష్యకు 23.5 డిగ్రీలు వంగి ఉంటుందనే విషయం తెలిసిందే.
అంటే మధ్యాహ్నం 12 గంటల సమయానికి సూర్యుడు ఉచ్ఛస్థితికి చేరుకుంటాడు. ఈ భ్రమణం వల్ల ఉత్తరాయణం, దక్షిణాయణంలో మన నీడ మనకు కనిపించదు. ఈ ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయం ముగియడానికి ఎంతో సమయం పట్టదు. ఇది సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషంలో ఇది పూర్తవుతుంది. 2021లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జీరో షాడో డే సంభవించింది. ఈ ఏడాది బెంగళూరు దీనికి వేదిక అయింది.
Come celebrate Zero Shadow Day #ZSD at our Koramangala campus on 25 Apr from 10 AM-1 PM. Sun☀️ will be directly overhead at 12:17.
— IIAstrophysics (@IIABengaluru) April 20, 2023
Please register at https://t.co/WYPjJiywJT
📅 25 April
⏲️ 10 AM - 1 PM@asipoec @IndiaDST @srivaric @JNPlanetarium @PrinSciAdvGoI @SciGalleryBlr pic.twitter.com/2rB5Y3ee3o
ఈ అరుదైన రోజును పురస్కరించుకుని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కోరమంగళలోని తన క్యాంపస్‌లో లైవ్ డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వనుంది. అన్ని నగరాల్లో ఇలాంటి అరుదైన ఘటన సంభవించదు. ఈక్వేటర్, లాటిట్యూడ్ కాలిక్యులేషన్ల ప్రకారం.. ఈ దఫా బెంగళూరులో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది.












Click it and Unblock the Notifications