Delivery boys: జొమాటో ముసుగులో డోర్ టూ డోర్ డ్రగ్స్ డెలివరీ, ఓరినా టమాటా.. లాజిక్ మిస్ అయ్యింది !

జొమాటోలో డెలవరీ బాయ్స్ గా పని చేస్తున్న కొందరు విదేశీయులతో చేతులు కలిపి డోర్ టూ డోర్ డ్రగ్స్ సరఫరా చేశారు. ఓరి జొమాటో బాయ్స్ ఇక్కడ టమోటో లాజిక్ మిస్ అయ్యిందిరా అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో లోకల్ కంటే నాన్ లోకల్ పీపుల్ ఎక్కువగా నివాసం ఉంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు బెంగళూరులో దర్శనం ఇస్తుంటారు. ఇక చదువుల కోసం, వ్యాపారం కోసం విదేశీయులు వేల సంఖ్యలో బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఐటీ హబ్ లో ఎక్కువగా డోర్ టూ డోర్ వుడ్ డెలవరీ జరుగుతోంది. ఫుడ్ డెలవరీ చేసే సంస్థలో జొమాటో సంస్థ కూడా ఉంది. జొమాటోలో డెలవరీ బాయ్స్ గా పని చేస్తున్న కొందరు విదేశీయులతో చేతులు కలిపి డోర్ టూ డోర్ డ్రగ్స్ సరఫరా చేశారు. ఓరి జొమాటో బాయ్స్ ఇక్కడ టమోటో లాజిక్ మిస్ అయ్యిందిరా అంటూ పోలీసులు రంగంలోకి దిగడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

విదేశీయులు, డెలవరీ బాయ్స్ డీలింగ్

విదేశీయులు, డెలవరీ బాయ్స్ డీలింగ్

ఇంటింటికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌లు, ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 11 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు వేర్వేరు కేసుల్లో పట్టుకున్నారు.

టాంజానియాకు చెందిన టిబెరియస్ న్యాకుండి, కెన్యాకు చెందిన కెర్రీ సారా, మహ్మద్ రిజ్వాన్, కేరళకు చెందిన రాగేష్, సచిన్, షాహుల్, బెంగళూరులోని హలాసూరులో నివాసం ఉంటున్న ప్రశాంత్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిద్ధాంత్ సహా మొత్తం 11 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులో డ్రగ్స్ సీజ్

బెంగళూరులో డ్రగ్స్ సీజ్

నిందితుల నుంచి 926 గ్రాముల ఏడీఏ క్రిస్టల్, 117 ఏడీఏ ఎక్సైటసీ ట్యాబ్లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. అదే విదంగా మరి కొందరు నిందితుల నుంచి గ్రాముల ఎస్ 37, 219 ఎల్ 38లను స్వాధీనం చేసుకున్నారు. ఆషీష్ ఆయిల్ తో సహా మొత్తం రూ.1. 34 కోట్ల విలువైన డ్రగ్స్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీహెచ్, ప్రతాప్ రెడ్డి మీడియాకు చెప్పారు.

స్టూడెంట్ వీసాతో వచ్చి డ్రగ్స్ వ్యాపారం

స్టూడెంట్ వీసాతో వచ్చి డ్రగ్స్ వ్యాపారం

స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చిన టిబెరియస్, కెర్రీలు బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ పొందారు. నిందితులు బెంగళూరులోని బాణసవాడి సమీపంలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. టిబెరియస్ ఆఫ్రికన్ కిచెన్ సర్కిల్‌లోని డ్రగ్స్ డీలర్లకు సుపరిచితుడని, తరువాత డబ్బు సంసాధించడం కోసం డ్రగ్స్‌ విక్రయించడం మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు.

ఓరి నా టమోటో...... ఇక్కడ లాజిక్ మిస్ అయ్యింది

ఓరి నా టమోటో...... ఇక్కడ లాజిక్ మిస్ అయ్యింది

బెంగళూరులోని కేఆర్‌పుర సమీపంలో నివాసం ఉంటున్న షాహుల్, హలాసూరుకు చెందిన ప్రశాంత్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిద్ధాంత్‌లు జొమాటో యాప్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా పనిచేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇంటింటికీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెలుగు చూడటంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ఆరు నెలలుగా డ్రగ్స్ విక్రయాల్లో నిందితులు చాలా బిజీగా ఉన్నారని పోలీసులు అన్నారు. జొమాటో డెలవరీ బాయ్స్ అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు వారికి టమోటో తినిపించి ఎత్తి లోపల వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+