షాకింగ్: మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేసిన జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ (వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ జోమాటో డెలివరీ బాయ్.. ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె ముక్కు ఫ్యాక్చరైంది. ముక్కు నుంచి రక్తం కారింది. ఈ నేపథ్యంలో బాధితురాలు జోమాటో నిర్వాహకులు, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు బుధవారం ట్విట్టర్ వేదికగా తన బాధను పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ దాడిలో గాయపడిన బాధితురాలు హితేషా చంద్రానీ.. తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

తనను ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేశాడని కన్నీటిపర్యంతమవుతూ తెలిపింది. దీనిపై జోమాటో యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వారు స్పందించారు. ఈ ఘటన గురించి తమకు తెలియజేసినందుకు ధన్యవాదాలంటూ జోమాటో ఆమెకు భరోసా ఇచ్చింది. ఇలాంటి దాడులను తాము సహించమని, సరైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
So guys this just happened to me yesterday
— Hitesha Chandranee (@HChandranee) March 10, 2021
Pls support me @zomato @zomatoin @viralbhayani77 @sagarmaheshwari @ATSBB @bbcnewsindia @narendramodi @cnnbrk @AltNews @NBCNews @itvnews @DgpKarnataka @TV9Telangana pic.twitter.com/TBso6N23k3
అంతేగాక, తమ కంపెనీకి చెందిన స్థానిక ప్రతినిధులు బాధితురాలిని కలిసి వివరాలను తెలుసుకుంటారని, ఆమెకు తగిన విధంగా సహాయం చేస్తారని జోమాటో తెలిపింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకునేలా చూస్తామని ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
చికిత్సకు అవసరమైన ఏర్పాటు చేస్తామని, తమ ప్రతినిధి కారణంగా జరిగినదానికి తాము మీకు(బాధితురాలికి) ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదని జోమాటో వెల్లడించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అకారణంగా మహిళపై దాడి చేసిన సదరు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications