Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ ధర విని షాకైన జుకర్ బర్గ్.. ఇంతకీ దాని రేటు ఎంతంటే..!
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ న బూతో న భవిష్యత్ అన్న తరహాలో జరిగాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఈ ప్రీ వెడ్డింగ్ కు ప్రపంచ నలుమూల నుంచి ప్రముఖులు వచ్చారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ లతోపాటు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఫంక్షన్ కు హాజరయ్యారు.
అనంత్ అంబానీ వివాహానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సందర్భంలో అనంత అంబానీ ధరించిన వాచ్ పై చర్చ కొనసాగుతోంది. అనంత్ అంబానీ చేతికి ఉన్న గడియారం ధర రూ.8 కోట్లటు. ఇంత విలువైన వాచ్ ను చూసిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ షాకైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జుకర్ బర్గ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తువులు ధరించాడు. ఆయన భార్య ప్రిసిల్లాతో కలిసి అనంత్ అంబానీ తో మాట్లాడారు.

జుకర్ బర్గ్ భార్య అనంత్ వాచీ చాలా బాగుందని చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. అనంత్ అంబానీ ఇది రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన వాచీ అని ప్రిసిల్లాకు చెప్పాడు. అనంత్ అంబానీ పెట్టుకున్న గడియారం బ్రాండ్ గురించి చాలా మంది నెట్ సెర్చ్ చేస్తున్నారు. రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన గడియారాలు 80వేల డాలర్ల నుంచి మొదలై 1 మిలియన్ డాలర్ల వరకు ఉంటాయట.
గతంలో ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ తన పెళ్లిలో 90 కోట్ల రూపాయల విలువైన లెహంగాను ధరించారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో తల్లి నీతా అంబానీ చేసిన డ్యాన్స్ ఈ వేడుకకే హైలెట్ గా నిలిచింది. ఆమె తన ప్రదర్శనను మనవరాలు ఆదియ శక్తి, వేద స్త్రీ శక్తికి ప్రతిరూపమైన యువతులందరికీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications