Sahara Insurance: SBI చేతిలో సహారా ఇన్సూరెన్స్ భవిష్యత్తు.. ఏం జరుగుతోంది..?

Sahara Insurance: అనేక వ్యాపారాలను నిర్వహిస్తూ ఒకప్పుడు దేశంలో వెలుగొందిన సహారా గ్రూప్ ఆ తర్వాత పతనమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కంపెనీ ఫైనాన్స్ నుంచి రిటైల్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహించింది. ఇప్పటికీ అనేక మంది డబ్బు సహారా వద్ద ఇరుక్కు పోయింది.

అయితే తాజాగా సహారా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోని పాలసీదారుల ప్రయోజనాలను రక్షించేందుకు, వారి పెట్టుబడులకు రక్షణ కల్పించాలని IRDAI నిర్ణయించింది. ఇందుకోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కో (SILIC) వ్యాపారాన్ని తక్షణమే చేపట్టాలని SBI లైఫ్ ఇన్సూరెన్స్‌ను కోరింది.

saharasbi

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI ఆదేశాలను పాటించడంలో, పాలసీదారులను పరిరక్షించడానికి నిశ్చయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకోబడిందని విలేకరుల సమావేశంలో బీమా నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఒకపక్క పెరుగుతున్న నష్టాలతో పాటు మరోపక్క మొత్తం ప్రీమియమ్‌కు ఎక్కువ శాతం క్లెయిమ్‌లతో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక స్థితి క్షీణిస్తున్న తరుణంలో తాజా నిర్ణయం జరిగింది.

ఇదే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారి మూలధనం కోతకు దారితీస్తుందని రెగ్యులేటర్ అభిప్రాయపడింది. ఇది పరోక్షంగా పాలసీదారులకు ప్రమాదం చేకూరుస్తుందని వెల్లడించింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ FY22లో మొత్తం ప్రీమియం రూ.61.44 కోట్లు వసూలు చేసింది. ఇది SBI లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం ప్రీమియంలో 0.25% మాత్రమేనని తెలుస్తోంది. దీనికి ముందు 2017లో రెగ్యులేటర్ సహారా ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నిర్వహించటానికి ఒక అధికారిని నియమించింది.

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని జూలై 31, 2017 నుంచి టేకోవర్ చేయడానికి ఇదే విధమైన ఆర్డర్‌ను జారీ చేసింది. అయితే జనవరి 2018లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ బీమా రెగ్యులేటర్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు సహరా లైఫ్ లోని దాదాపు 2 లక్షల మంది పాలసీదారుల బాధ్యతలను SBI లైఫ్ టేకోవర్ చేయనుంది. IRDAI తదుపరి ఆర్డర్ ఇచ్చే వరకు వాటాదారుల పెట్టుబడులు అడ్మినిస్ట్రేటర్ నియంత్రణ, పర్యవేక్షణలో కొనసాగుతాయని ఆర్డర్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+