అమెరికా ఎలిమెంటరీ స్కూల్ లో చిన్నారులపై గర్జించిన తుపాకీ: టీనేజర్ షూటర్ ఘాతుకం

అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పెచ్చరిల్లింది. నలుగురిని పొట్టనబెట్టుకుంది. ఒరెగాన్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనతో ఆ దేశం ఉలిక్కిపడింది. ఈ కాల్పులకు తెగబడింది.. ఓ 16 సంవత్సరాల టీనేజర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో షూటర్ కూడా మరణించాడు. ఈ ఘటన తర్వాత స్కూల్ ను తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు.

బెండ్ సిటీలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్ లో అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన 16 ఏళ్ల సాయుధ యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ యథేచ్ఛగా స్కూల్ లో తిరిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్న పిల్లలు, ఓ ఉపాధ్యాయురాలు బుల్లెట్లకు బలి అయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

16 Year Old Gunman Kills Three Children and a Teacher in Oregon Elementary School Shooting in US

స్కూల్ లోకి చొరబడిన ఆ ఆగంతకుడిని ఓ స్థానిక పౌరుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన రివాల్వర్ తో అతన్ని కాల్చిచంపడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. మొదట స్కూల్ బయట పార్క్ చేసిన ఉన్న ఓ వాహనంపైకి ఆ టీనేజర్ కాల్పులు జరిపాడు. ఆ తర్వాత గేట్ ను తోసుకుంటూ స్కూల్ బిల్డింగ్ లోకి ప్రవేశించాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకోవడానికి విఫలయత్నం చేశారు. బిల్డింగ్ లోకి ప్రవేశించిన వెంటనే యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. దాదాపుగా 20 నిమిషాల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారక్కడి విద్యార్థులు, సిబ్బంది.

ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!
ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!

ఈ విషయం తెలిసిన స్థానికుడొకరు ప్రాణాలకు తెగించి నిందితుడిని అనుసరిస్తూ పాఠశాల లోపలికి వెళ్లాడు. తన లైసెన్స్డ్ పర్సనల్ రివాల్వర్ తో అతన్ని కాల్చి చంపాడు. ఆ పౌరుడి సాహసోపేత చర్య వల్ల భారీ ప్రాణనష్టం తప్పినట్టయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్లు వచ్చేటప్పటికే షూటర్ చనిపోయాడు. ఈ కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థుల వయస్సు 5, 8, 11 సంవత్సరాలుగా పోలీసులు ధృవీకరించారు.

దేశాధ్యక్షుడి భవనంపై హౌతీల భీకర దాడి: యెమెన్ లో అంతర్యుద్ధం
దేశాధ్యక్షుడి భవనంపై హౌతీల భీకర దాడి: యెమెన్ లో అంతర్యుద్ధం

కాల్పుల ఘటనలో మరో ఏడేళ్ల విద్యార్థినితో పాటు ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెడికల్ స్టాఫ్ సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్ లో కిండర్‌గార్టెన్ నుంచి అయిదో తరగతి వరకు సుమారు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. 40 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తోన్నారు. ఘటన జరిగిన వెంటనే పాఠశాలను అధికారులు లాక్‌డౌన్ చేశారు.

తల్లిదండ్రులకు పిల్లలను సురక్షితంగా అప్పగించేందుకు సమీపంలోని చర్చిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషాదం నేపథ్యంలో బెండ్ లా పైన్ పాఠశాలల పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, స్పోర్ట్స్ ఈవెంట్స్ కు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఒరెగాన్ గవర్నర్ టీనా కోటెక్ ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల వెనుక గల కారణాలు, షూటర్ పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని బెండ్ సిటీ పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+