ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 23మంది మృతి(వీడియో)
మాస్కో: రష్యాలోని ఓ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వొరోనేజ్ ప్రాంతంలోని సైకియాట్రిక్ ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆస్పత్రిలో మొత్తం 74 మంది ఉండగా అందులో 21 మంది మృతిచెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు.
సిరియాలో కారు బాంబు పేలి 16 మంది మృతి
సెంట్రల్ సిరియాలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 16 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

బురుండిలో కాల్పులు: 34 మంది మృతి
బురుండి రాజధాని బుజుంబుర కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 34 మంది మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో సాయుధులు కూడా ఉన్నారు.
భారీ ఆయుధాలతో ఇళ్లల్లోకి చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. దేశాధ్యక్షుడు పియారీ నురింజిజా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 100 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications