అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన ఆ 25 దేశాలు .. భారత్ కు ఫుల్ సపోర్ట్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) లో భాగంగా దేశంలోని వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపించారు. అలాగే స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు పేరుతో విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై టారిఫ్ లు విధించారు. తాజాగా భారత్ పైనా 50 శాతం టారిఫ్ లు విధించారు ట్రంప్. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సుంకాలు ఆగస్టు 27నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికాపై ఆయా దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో ఇప్పటివరకూ 25 దేశాలు చేరాయి. భారత్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేసింది. జూలై 30, 2025న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా భారత్ తో పాటు 25 దేశాలు పోస్టల్ సర్వీసులను నిలిపివేసినట్లు యూఎన్ లోని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ తాజాగా వెల్లడించింది.
పోస్టల్ ప్యాకేజీలపై అమెరికా పన్ను మినహాయింపు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో పాటు ఇప్పటివరకు 25 దేశాలు అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేసినట్లు యూఎన్ విభాగం స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్ సహా ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్.. దేశాలు ఈ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జులై 30న అమెరికా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది.

ఇక రష్యా నుంచి భారీగా ముడి చమురును కొంటున్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి మరో 25 శాతం అదనపు సుంకం విధించారు. ఈ ఎక్స్ ట్రా సుంకం బుధవారం (ఆగస్టు 27) నుంచే అమల్లోకి రానుంది. ఉక్రెయిన్- రష్యా మధ్య మూడేళ్లకుపైగా జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టాలని ట్రంప్ భావించారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి అధిక మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్న భారత్ వస్తువులపై ట్రంప్ టారిఫ్ లు విధించారు.












Click it and Unblock the Notifications