27 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై పెళ్లాడిన 103 ఏళ్ల వృద్దుడు.. ఎలా వర్కౌట్ అయిందంటే..
ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పడం కష్టమని కవులు రాస్తుంటారు. ఈ ఫొటోలోని జంట విషయంలోనూ అదే జరిగింది. ఆమెకు 27 ఏళ్లు.. బాగా చదువుకుంది కూడా. అతనికేమో 103 ఏళ్లు.. మాజీ యుద్ధవీరుడు. ఈమధ్యే వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వైరలయ్యాయి. అప్పటికే వేరొక యువకుణ్ని ప్రేమించిన ఆ యువతి.. ఊహించని రీతిలో ముసలాయనకు దగ్గరై మనసిచ్చింది.. అనూహ్యమలుపులున్న వీళ్ల ప్రేమ కమ్ పెళ్లి గాథలోకి వెళితే..
ఇండోనేషియాలోని ప్రఖ్యాత సులావేసి దీవికి చెందిన 'ఇండో అలంగ్'అనే 27 యువతి.. కొన్నేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో గడిపింది. పెళ్లిచేసుకుందామనుకునేలోపే సదరు ప్రేమికుడు ప్లేటు ఫిరాయించాడు. చెప్పాపెట్టకుండా ఊరొదిలేసి వెళ్లిపోయాడు. ప్రేమికుడి ఎడబాటుతో షాక్ తిన్న అలంగ్.. దాదాపు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు 'పువాంగ్ కతే' అనే వృద్ధుడితో పరిచయం ఏర్పడింది.

ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉన్నప్పటికీ అంతకుముందు ఆ వృద్ధుణ్ని పట్టించుకునేది కాదా యువతి. బాయ్‌ఫ్రెండ్‌తో ఎడబాటు తర్వాత ఆమె తన బాధను పువాంగ్ తో పంచుకుంది. అతని ఓదార్పు మాటలు, అప్యాయత ఆమెకెంతో నచ్చాయి. క్రమంగా ఒకరినొకరు ఇష్టపడటం.. ప్రేమలో పడటం జరిగిపోయాయి. ఒకదశలో శారీరకంగాననూ వాళ్లిద్దరూ ఒకటయ్యారు. ఆ తర్వాత మూడు నెలలకే అలంగ్ గర్భందాల్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారా జంట.
Recommended Video

ముసలోడితో పెళ్లేంటని అలంగ్ ఇంట్లోవాళ్లు అభ్యంతర పెట్టలేదు. ఎందుకంటే ఇండోనేషియాలో పెద్ద వయసున్న మగాళ్లు.. చిన్నవయసున్న యువతుల్ని పెళ్లాడటం తరచూ జరిగేది. అయితే ఏకంగా 76 ఏళ్ల వయసు వ్యత్యాసంతో జరిగిన పెళ్లిమాత్రం ఇదొక్కటే. కాబట్టే ఈ వార్త వైరలైంది. రెండు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి జరిగింది. పెళ్లికొడుకు పువాంగ్ ను ఆయన మనవళ్లే దగ్గరుండి రెడీ చేశారట. అన్నట్లు.. పెళ్లిలో కన్యాశుల్కంగా రూ.25 వేల నగదు, బంగారు ఉంగరాన్ని చదివించుకున్నాడట 103ఏళ్ల పువాంగ్.












Click it and Unblock the Notifications