వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన చార్టర్డ్ ప్లేన్: కూలుతుండగా దూకిన యువతి!

కాలిఫోర్నియాలో ఓ చార్టర్ విమానం కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఓ యువతి అది కూలుతుండగా అందులో నుంచి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకుంది. అమెను అందులో ఉన్న వారు బయటకు విసిరేసినట్లుగా చెబుతున్నారు

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో ఓ చార్టర్ విమానం కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఓ యువతి అది కూలుతుండగా అందులో నుంచి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకుంది. అమెను అందులో ఉన్న వారు బయటకు విసిరేసినట్లుగా చెబుతున్నారు. నివాసాల పైన అది కూలింది.

అకస్మాత్తుగా కూలిపోతున్న విమానాన్ని చూసి దక్షిణ కాలిఫోర్నియావాసులు అవాక్కయ్యారు. రెండు ఇళ్లను ఢీకొంటూ విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి.

3 dead in California plane crash

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. రివర్ సైడ్ అగ్నిమాపక శాఖ అధిపతి మైఖేల్ మూరే స్పందించారు.

భర్త, భార్య, ముగ్గురు టీనేజర్లు వారాంతపు సెలవులను ఆనందంగా గడిపేందుకు సెస్నా విమానంలో డిస్నీలాండ్‌ వెళ్ళి, తిరిగి వస్తూండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.

ఈ టీనేజర్లలో ఓ అమ్మాయిని కూలిపోతున్న విమానం నుంచి విసిరేశారన్నారు. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించామని, ఆమె మాట్లాడగలుగుతోందన్నారు. ప్రమాదానికి గురైన ఓ ఇంట్లోని బాధితుడికి ఆపరేషన్ జరిగిందన్నారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారేమో పరిశీలిస్తున్నట్లు తెలిపారు

English summary
Three people were killed and two injured Monday when a small plane crashed into a residential neighborhood in Riverside, California, said the city's Fire Chief Michael Moore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X