గత జన్మలో తనను హత్య ఎవరు చేశారో చెప్పిన బాలుడు... ఐదేళ్ల తర్వాత సోషల్ మీడియాలో హల్ చల్
జన్మలు, పునర్జన్మల గురించి కథలు, సినిమాల్లో చూశాం. ఈ మధ్యకాలంలో సీరియళ్లలోనూ చూస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటన గురించి బయటపడిన సందర్భాలు లేవనే చెప్పాలి. అసలు పునర్జన్మ ఉందా లేదా అన్న అంశంపై పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు ఇంకా ఏమీ తేల్చలేకపోయారు. అయితే ఐదేళ్ల క్రితం ఓ మూడేళ్ల బాలుడు తన గత జన్మ గురించి చెప్పిన రహస్యం విని మొదట ఎవరూ నమ్మలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. చివరకు గత జన్మలో ఆ బాలున్ని చంపిన హంతకున్ని పట్టించాయి. ఐదేళ్ల క్రితం నాటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గత జన్మస్మృతులు చెప్పిన బాలుడు
సిరియా - ఇజ్రాయెల్ సరిహద్దులోని గోలస్ హైట్స్ ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడి కథ ఇది. పుట్టుకతోనే నుదుటిపై ఎర్రటి గీత ఉన్న ఆ బాలుడు మాటలు రాగానే తన కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు. గత జన్మ స్మృతులు జ్ఞాపకం తెచ్చుకుని వణికిపోయాడు. పూర్వ జన్మలో ఓ వ్యక్తి తనను గొడ్డలితో తలపై నరికి చంపేశాడని చెప్పాడు. అది విన్న అతని కుటుంబసభ్యులు తొలుత నమ్మలేదు. అయితే తన హత్యకు సంబంధించిన ఆనవాళ్లు చెప్పడంతో వాళ్లు నమ్మక తప్పలేదు.

బుకాయించిన నిందితుడు
గత జన్మలో తాను నివసించిన గ్రామం పేరు చెప్పడంతో అతని తల్లిదండ్రులు బాలున్ని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి ఊరి వాళ్లతో విషయం చెప్పగా వాళ్లు తొలుత ఆశ్చర్యపోయారు. బాలుడు తనను హత్య చేసిన వ్యక్తి పేరు చెప్పడంతో అతని వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పగా సదరు వ్యక్తి ముఖం రంగు మారింది. తానే తప్పు చేయలేదని బుకాయించాడు.

ఆధారాలు చూపిన బాలుడు
హత్య చేసిన విషయాన్ని నిందితుడు అంగీకరించకపోవడంతో బాలుడు గ్రామస్థులను ఒక చోటకు తీసుకెళ్లాడు. అక్కడ తవ్వమని చెప్పాడు. అక్కడ తవ్వి చూడగా.. పుర్రెపై గాయం ఉన్న అస్థిపంజరంతో పాటు హత్యకు ఉపయోగించిన గొడ్డలి దొరికింది. సాక్ష్యాలు బయటపడటంతో చివరకు నిందితుడు జరిగిన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. జర్మన్ థెరపిస్ట్ ట్రూట్జ్ హార్డో చిల్డ్రన్ హూ హావ్ లివ్డ్ బిఫోర్, రీఇంకర్నేషన్ టుడే అనే పుస్తకంలో రాసిన కథ ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications