Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెరూలో 3,500 ఏళ్ల నాటి నగరం గుర్తింపు.. అమెరికా నాగరికతపై కొత్త రహస్యాలు!

Penico: దక్షిణ అమెరికా దేశం పెరూలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక పురాతన నగరాన్ని కొనుగొన్నట్లు ప్రకటించారు. పెరూలోని ఉత్తర బరాంకా ప్రాంతంలో దాదాపు 3,500 ఏళ్ల నాటి "పెనికో" నగరమని వారు వెల్లడించారు. పరిశోధనల ప్రకారం.. ఈ పెనికో నగరం ఒకప్పుడు పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది. ఇది పసిఫిక్ తీర ప్రాంతంలో ఏర్పడిన సమాజాలు, అండీస్ పర్వత ప్రాంతాలు, అమెజాన్ బేసిన్‌లో‌ని సమూహాలను అనుసంధానించే కీలక వాణిజ్య కేంద్రంగా పెనికో పని చేసిందని భావిస్తున్నారు. ఈ 3,500 ఏళ్ల నాటి నగరం గుర్తింపుతో కారాళ్ నాగరికత గురించి కొత్త సమాచారం బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కారాళ్ అమెరికాలో అత్యంత పురాతన నాగరికతగా పరిగణించబడుతుంది.

నగర ఆవిష్కరణ వివరాలు ఇలా..
కనుగొనబడిన పెనికో నగరం పెరూ రాజధాని లిమాకు 200 కిలోమీటర్ల ఉత్తరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది. నగరం మధ్యలో ఒక గుండ్రటి నిర్మాణం ఉంది. ఇది ఒక కొండపై నిర్మించబడింది. దీని చుట్టూ రాతి, మట్టి భవనాలు ఉన్నాయి. ఈ నగరం క్రీస్తు పూర్వం 1,800 -1,500 సంవత్సరాల మధ్య నిర్మించబడిందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అరేబియా, ఆసియాలో కూడా నాగరికతలు అభివృద్ధి చెందుతున్నాయి.

3500-Year-Old City Penico Discovered in Peru New Secrets of Ancient American Civilization

ఎనిమిదేళ్ల పరిశోధన
ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో 18 భవనాలు కనుగొనబడ్డాయి. వీటిలో ఆలయాలు, గృహాలు ఉన్నాయి. ఈ భవనాల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు లభించాయి. మట్టి విగ్రహాలు, గవ్వలతో చేసిన హారాలు ఇక్కడ దొరికాయి. కనుగొనబడిన పెనికో నగరం కారాళ్‌కు సమీపంలో ఉంది. కారాళ్ అమెరికాలో అత్యంత పురాతన నాగరికతగా పరిగణించబడుతుంది. ఈ నాగరికత 5,000 సంవత్సరాల క్రితం సుపే లోయలో ఏర్పడింది. దీనిని కారాళ్-సుపే నాగరికత అని పిలుస్తారు.

కారాళ్‌‌లో పిరమిడ్లు, నీటి పారుదల వ్యవస్థలు, నగరాలతో సహా 32 స్మారక కట్టడాలు ఉన్నాయి. కారాళ్ నాగరికతను భారత్, ఈజిప్ట్, సుమేరియా, చైనాల నాగరికతలకు సమకాలీనంగా పరిగణిస్తారు. అయితే ఇది పూర్తి విభిన్నంగా ఒంటరిగా అభివృద్ధి చెందింది. కారాళ్‌పై పరిశోధనలు చేసిన డాక్టర్ రూత్ షేడీ ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా కారాళ్ నాగరికత అంతరించిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+