రష్యాలో భారతీయ విద్యార్థులకు కత్తిపోట్లు- ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో
రష్యాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత్ కు చెందిన నలుగురు విద్యార్థులు కత్తిపోట్లకు గురయ్యారు. ఉఫా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నలుగురు కూడా వైద్య విద్యార్థులే. మెడికల్ కోర్స్ చేయడానికి వేర్వేరు రాష్ట్రాల నుంచి రష్యా వెళ్లారు. బాష్కోర్టోస్టాన్ రిపబ్లిక్‌లోని ఓ మెడికల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
రష్యా కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల యువకుడొకడు ఉఫా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడ్డాు. నేరుగా హాస్టల్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యార్థులపై ఆకస్మికంగా కత్తితో దాడి చేశాడు. హాస్టల్ ప్రాంగణంలో స్వైరవిహారం చేశాడు. కనిపించిన వారిపై కనిపించినట్టే దాడికి పాల్పడ్డాడు. ఊహించని విధంగా ఈ ఘటన సంభవించడంతో విద్యార్థులు తేరుకోలేకపోయారు.

రష్యా హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు పలువురు విద్యార్థులను కత్తితో పొడిచాడు. వీరిలో నలుగురు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, నిందితుడు ఇద్దరు పోలీసులపై కూడా దాడి చేశాడు. అరెస్టును ప్రతిఘటించే క్రమంలో దాడి చేసిన యువకుడు కూడా స్వయంగా గాయపడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు గాయపడ్డారని, దాడి చేసిన వ్యక్తి కూడా గాయాల పాలయ్యాడని హోం శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇరినా వోల్క్ తెలిపారు.
ఈ దాడిలో గాయపడిన విద్యార్థులందరినీ ఆసుపత్రిెకి తరలించారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దాడికి పాల్పడిన యువకుడిని కూడా ఆసుపత్రిలో చేర్చగా, అతని పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. అతనికి చికిత్స కొనసాగుతోంది. నిందితుడికి నిషేధిత నియో-నాజీ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని స్థానిక మీడియా తెలిపింది. దాడి సమయంలో అతను జాతీయవాద నినాదాలు చేసినట్టు కూడా సమాచారం. దర్యాప్తు ఏజెన్సీలు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ సంఘటన తర్వాత యూనివర్సిటీ, పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు. దాడుల అనంతరం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోన్నామని, భారతీయ విద్యార్థుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నామని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఘటన పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications