టెహ్రాన్‌లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతి

టెహ్రాన్: మరో విమానం కూలిపోయింది. ఈ విమానం కూలిన ఘటనలో నలభై మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని మెహరాబాద్ విమానాశ్రయంలో ఓ విమానం కూలిపోయింది. ఈ దారుణ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 40 మంది ప్రయాణీకులు చనిపోయారు.

విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ దారుణం సంభవించింది. ఇంజిన్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

40 killed as passenger jet crashes in Tehran

కాగా, ఇరానియన్ స్టేట్ టెలివిజన్ 48 మంది చనిపోయినట్లుగా తెలిపింది. చనిపోయిన వారిలో 40 మంది ప్రయాణీకులు, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం గం.9.20 నిమిషాలకు కుప్పకూలింది.

కూలిన విమాం ఇరాన్ 140 జెట్. ఈ విమానాన్ని సాధారణంగా షార్ట్ డొమెస్టిక్ ఫ్లైట్‌గా వినియోగిస్తారు. మూడేళ్ల క్రితం.. అంటే జనవరి 2011లో చివరిసారి ఇరాన్‌‍లో ఓ విమానం క్రాష్ అయింది. ఈ ఘటనలో 77 మంది వరకు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+