'సారీ, అమ్మా తమ్ముడ్ని కాల్చేశా': 9 నెలల చిన్నారిని చంపిన అన్న
హైదరాబాద్: ఐదేళ్ల వయసుగల ఓ బాలుడు తొమ్మిదేళ్ల తన తమ్ముడిని కాల్చి చంపిన సంఘటన అమెరికాలో జరిగింది. తన ఐదేళ్ల కుమారుడు ప్రమాదవశాత్తు తన మరో కుమారుడిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఓ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.
తమ్ముడి పైన కాల్పులు జరిపిన అనంతరం ఆ బాలుడి తుపాకీని మంచం కింద పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, బాలుడి చేతికి అందిన ఆ తుపాకీ వారి బంధువుదని పోలీసులు చెప్పారు. ఆయుధం యజమానిని పోలీసులు విచారించారు. తన తమ్ముడిని కాల్చిన అనంతరం.. ఐదేళ్ల బాలుడు తన తల్లితో.. సారీ మామ్, తమ్ముడ్ని కాల్చాని అని చెప్పాడు.

చార్లీపై భగ్గుమన్న ముస్లింలు
ఫ్రాన్స్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డోకు వ్యతిరేకంగా పలు ముస్లిం దేశాల్లో ఆగ్రహ జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఆ పత్రికకు, ఫ్రాన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది ర్యాలీలు నిర్వహించారు. చెచెన్యా రాజధాని గ్రాంజీలో చారిత్రక మసీదు వద్ద 8 లక్షల మందికిపైగా ముస్లింలు గుమిగూడి చార్లీ హెబ్డో తీరును ముక్తకంఠంతో ఖండించారు.
ప్రవక్త చిత్రాన్ని ఇలా బహిరంగంగా ప్రచురించడం ఇస్లాంకు వ్యతిరేకమని పేర్కొన్న స్థానిక నేత చార్లీ హెబ్డో వైఖరి అసభ్యం, అనైతికమని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్తను పొగుడుతూ నినాదాలు రాసి బెలూన్లను గాల్లోకి విడుదల చేశారు. అయితే సమయంలో ఐరోపా మమ్మల్ని ఐక్యం చేసిందని కూడా వాటిపై రాశారు. వీరి ఆందోళనకు రష్యా కూడా మద్దతు తెలిపింది. చార్లీహెబ్డోలో వచ్చిన కార్టూన్లను పునఃప్రచురించవద్దంటూ స్థానిక పత్రికలను రష్యా ఆదేశించింది.












Click it and Unblock the Notifications