జపాన్‌లో భారీ భూకంపం: 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరిక జారీ

టోక్యో: జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. గురువారం దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

కాగా, భూకంప కేంద్రం సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. క్యుషు ద్వీపంలోని నిచినాన్, మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది. 1.6 అడుగుల ఎత్తులో అలలు కనిపించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నట్లు చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ వెల్లడించారు.

7 1 magnitude earthquake hits Japan Tsunami warning issued

భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. క్యుషు, షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. కాగా, 2011లో సంభవించిన భూకంపం, సునామీతో ఫుకుషిమా అణుకేంద్రం దెబ్బతింది. అప్పటి నుంచి ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, జపాన్ దేశంలో ప్రతి సంవత్సరం సగటున 5 వేల చిన్నా పెద్దా భూకంపాలు సంభవిస్తుంటాయి. అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. భూకంప పరిస్థితులను తట్టుకునేలా వారి నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంది. 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో 450 అగ్నిపర్వతాలున్నాయి.

ఇందులో మెజార్టీ అగ్నిపర్వతాలు జపాన్‌లోనే ఉన్నాయి. ఇవన్నీ క్రియాశీలకంగా ఉండటం గమనార్హం. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్స్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ఫలకాలు తరచూ కదులుతూ ఉంటాయి. వీటి కారణంగానే తరచూ భూ ప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+