ఫ్లోరిడాలో కుప్పకూలిన జెట్- కారు డ్యాష్ క్యామ్ లో.. !!
అమెరికాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓ జెట్ ప్రమాదానికి గురైంది. 15,000 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తోన్న తొమ్మిదిమందీ దుర్మరణం పాలయ్యారు. ఈ జెట్ ఫ్లైట్ శకలాలు నివాస స్థలాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.
ఫ్లోరిడాలో ఈ దుర్ఘటన సంభవించింది. టెక్సాస్ లోని ఆస్టిన్ నుంచి బహమాస్ కు బయలుదేరిన బిజినెస్ జెట్ ఇది. ఎన్ 722 బీడీ లియర్ జెట్ 60 అనే సంస్థకు చెందినది. మొత్తం తొమ్మిదిమందితో ఆస్టిన్- బెర్గ్ స్ట్రామ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ ఫ్లైట్ బహమాస్ చేరాల్సి ఉండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఫ్లోరిడా దక్షిణ ప్రాంతం గగనతలం మీదికి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. కుప్పకూలింది.

నేలను తాకిన వెంటనే పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయిందా జెట్. భారీగా మంటలు చెలరేగాయి. దీని శకలాలు సమీపంలో ఉండే నివాసాలు, రద్దీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ మార్గంలో వెళ్తోన్న వాహనాల డ్యాష్ క్యామ్, ఇళ్లల్లో అమర్చిన సీసీటీవీల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ జెట్ నేలకూలిన చోట గొయ్యి సైతం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే ఫ్లోరిడా పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
New video: Business jet dives into Greenacres, Florida at high speed.All 9 aboard the Learjet killed. Austin → Bahamas flight.Devastating impact. Investigation underway.#Florida #PlaneCrash https://t.co/1gHLL0DcVd
— Conflict Monitor (@ConflictM0nitor) November 2, 2026
ఈ ప్రమాదానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తోన్నామని అమెరికా రవాణా మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానం కాక్‌పిట్‌లో నమోదైన సంభాషణలను రికార్డింగ్‌లను లైట్ ఏటీసీ భద్రపరిచింది. మంచు సమస్య ఉన్నట్లు పైలెట్ చెప్పడం వినిపించింది. , ఆ తర్వాత విమానం వేగంగా ఎత్తును కోల్పోతోందని, నేలకూలిపోబోతున్నామని చెప్పడం ఇందులో రికార్డయింది.












Click it and Unblock the Notifications
