Freddy Cyclone: మలావిని వణికిస్తున్న ఫ్రెడ్డీ తుఫాన్.. 99 మంది మృతి..

ఫ్రెడ్డీ తుఫాన్ ధాటికి మలావిలో 99 మంది మృతి చెందారు.

ఉష్ణమండల తుఫాను ఫ్రెడ్డీ తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో తాకింది. ఈ తుఫాన్ తో దాదాపు 99 మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ మిషన్ కొనసాగుతోందని అధికారులు వివరించారు. ప్రాణాలు పోయిన వారిలో 60 మృదేహాలను గుర్తించినట్లు తెలిసింది. నెల వ్యవధిలో ఇది రెండో తుఫాన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బ్లాంటైర్‌

బ్లాంటైర్‌

వాణిజ్య నగరమైన బ్లాంటైర్‌లోనే 85 మరణాలు నమోదయ్యాయని డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ అఫైర్స్ (DoDMA) కమిషనర్ చార్లెస్ కలెంబా చెప్పారు. తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 10 జిల్లాల్లో ఆస్తి నష్టంతో పాటు చాలా మంది గాయాలయ్యాయి. బ్లాంటైర్‌లో 134 మందికి తీవ్రమైన గాయాలు అయినట్లు కలేంబా చెప్పారు. బ్లాంటైర్‌తో సహా ప్రభావిత జిల్లాల్లో నివాస గృహాలు కూలిపోవడం, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల మరణాలు సంభవించాయి.

నదులు

నదులు


ఫ్రెడ్డీ తుఫాన్ ధాటికి అక్కడు నదులు పొంగిపోర్లుతున్నాయి. తుఫానుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. సోమవారం ఉదయం నుంచి దాదాపు దేశం మొత్తం చీకటిలో ఉంది. మలావియా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా దక్షిణ ప్రాంతంలో తీవ్రంగా ప్రభావితమైన 10 జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

మొజాంబిక్‌

మొజాంబిక్‌

ఫ్రెడ్డీ అనేది అత్యంత బలమైన ఉష్ణమండల తుఫానుగా ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. ఇది దీర్ఘకాలం కొనసాగే తుఫాను కూడా కావచ్చని అంచనా వేసింది. ఆదివారం ఇది మొజాంబిక్‌ను తాకింది. హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశమైన మడగాస్కర్‌కు ఈ తుఫాను ధాటికి నష్టపోయింది. ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఫోన్ సిగ్నల్స్ నిలిపివేయడంతో మొజాంబిక్‌లో సంభవించిన నష్టం, మరణాల సంఖ్యను గుర్తించడం కష్టంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+