Viral Video: నాకే ఇవ్వకుండా తింటారా.. ఏనుగు పిల్ల ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అవి చేసే పనులు నవ్వును తెప్పిస్తాయి. ముఖ్యంగా పిల్లి, కుక్క, కోతులు, ఏనుగులు చేసే పనులు హాస్యాన్ని పూయిస్తాయి. తాజాగా ఓ ఏనుగు పిల్ల చేసిన పనికి అందరికి నవ్వును తెప్పిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అరటి పండ్లను లాక్కున్న ఏనుగు..
ఈ వీడియోలో ఏనుగు పిల్ల వెళ్తుంటుంది. ఏనుగు వెళ్తున్న దారిలో ఇద్దరు వ్యక్తులు అరటి పండ్లు తింటుంటారు. అయితే అరటి పండ్లను చూసిన పిల్ల ఏనుగు నాకు ఇవ్వకుండా తింటారా అంటూ మొదటి వ్యక్తి వద్ద అరటి పండు లాక్కోని తిన్నది. మరొక వ్యక్తి అరటి పండు నోట్లో పెట్టుకోగా దాన్ని సైతం లాక్కొని తిన్నది గున్న ఏనుగు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇట్లనే ఉంటాది మనతోని..
ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏనుగు చాలా ముద్దస్తొందని ఒకరు.. ఈ ఏనుగు భలే తెలివైందని మరొకరు కామెంటే చేశారు. ఏనుగు పిల్లకు ఇవ్వకుండా తింటే ఇట్లనే ఉంటదని ఒకరు కామెంట్ చేశారు. అయితే వీడియో ఎక్కడ తీశారో, ఎప్పుడు తీశారో క్లారిటీ లేదు. ఈ పోస్ట్ కు 1,937 రీట్వీట్లు, 17.1K లైక్ లు వచ్చాయి.
The cutest robber. 💕😂pic.twitter.com/hmg8uAMOgz
— Figen (@TheFigen) July 24, 2022












Click it and Unblock the Notifications