viral video:రన్ వైపై పప్పీ రన్.. పరుగులు తీసిన సిబ్బంది.. ఎక్కడంటే..
చిత్ర, విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. మనం చూస్తుంటాం. కొన్ని సార్లు రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులలో ఇన్సిడెంట్స్ చూస్తుంటాం.. ప్రయాణాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడం సహజం. అలా ఒకరు శునకం తీసుకొచ్చారు. కానీ దానికి కట్టిన తాడు మాత్రం తెగిపోయింది. సరిగ్గా బోర్డింగ్ సమయంలో ఇలా జరిగింది. ఇంకేముంది అదీ పరుగు తీసింది. రన్ వే పై రన్ చేసింది. దీంతో సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఘటన మెక్సికో జలిస్కొలో జరిగింది.

పప్పీ పరుగులు
మెక్సికో గ్వడలాజరలో గల మిగ్వుల్ హిదాల్గొ వై కోస్తిలా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. వీడియోను వైరల్ హగ్ అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో శునకం పరుగు పెట్టించే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. శునకం తీసుకొచ్చే సమయంలో క్రెట్ నుంచి తప్పించుకుంది. ఇంకేముంది పరుగు తీయడం ప్రారంభించింది. ఎయిర్ పోర్టు సిబ్బందిని అలసిపోయేలా చేసింది. కానీ చివరికీ పట్టుకున్నారు.

గాయం కాలేదు..
ఆ పప్పీని పట్టుకునేందుకు సిబ్బంది బాగానే కష్టపడ్డారు. పప్పీ ఎలా తప్పించుకుందనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. అదీ ట్రావెల్ చేసే పప్పీ.. లేదంటే పక్కనే గల వీధి కుక్క అనేది తేలాల్సి ఉంది. సిబ్బంది అపసోపాలు పడి దానిని పట్టుకోగలిగారు. ఆ సమయంలో వారికి ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. ఈ వీడియో మాత్రం వైరల్ అయ్యింది. నెటిజన్లు చాలా మంది నవ్వుకున్నారు. ఆ పప్పీ కోసం ఎందుకు పరుగు తీస్తున్నారని కామెంట్ చేశారు. ఆ విమానంలోకి వెళ్లడం లేదని మరొకరు అన్నారు. వ్యాయామం చేయడానికి తప్పించినట్టు ఉంది అని మరొకరు అన్నారు.
రన్ వైపై రచ్చ
ఆ పప్పీ మాత్రం విమానం కింద నుంచి.. రన్ వైపే మొత్తం కలియ తిరిగింది. ఉరుకులు పరుగులు తీసింది. అయితే ఆ సమయంలో రన్ వై పైకి వాహనాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆ శునకం మాత్రం తెగ కష్ట పెట్టించింది. తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత సిబ్బంది ఎలాగోలా పట్టుకున్నారు. లేదంటే విమానాలు టేకాఫ్, టేకాన్‌కు కష్టం అయ్యేది. ఆ తర్వాతే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా అంటూ దానిని ఈ సారి గట్టిగా కట్టేశారు.












Click it and Unblock the Notifications