ప్రముఖ పాప్ గాయని రిహానా ఇంట తీవ్ర విషాదం...
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన పాప్ సింగర్ రిహానా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి రోనాల్డ్ ఫెంటీ (70) అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అయితే ఆయనకు ఏ రకమైన వ్యాధి ఉందన్న విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. తండ్రి మృతి వార్త తెలియగానే రిహానా, ఆమె సోదరుడు లాస్ ఏంజెలెస్‌లోని సెడార్స్-సినాయ్ ఆసుపత్రి వద్ద కనిపించారు. అభిమానులు, సంగీత ప్రపంచం ఈ విషాద వార్తపై స్పందిస్తూ రిహానాకు సంతాపం తెలుపుతున్నారు.

గతంలో తండ్రీ కూతుళ్ల మధ్య విభేదాలు..
రోనాల్డ్ ఫెంటీతో రిహానాకు గతంలో సత్సంబంధాలు లేవన్నది అందరికీ తెలిసిన సంగతే. ఇద్దరి మధ్య వ్యక్తిగత, కుటుంబపరమైన వివాదాలు ఏర్పడి, కొన్ని సంవత్సరాల పాటు మాటలు కూడా లేవు. ఫెంటీ కొంతకాలం రిహానా జీవితానికి దూరంగా ఉండడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల తండ్రీ కూతుళ్ల మధ్య సంబంధాలు మళ్లీ చిగురించాయి.
పాత విభేదాలను పక్కన పెట్టి ఇద్దరూ స్నేహపూర్వకంగా కలిసి ఉండటం ప్రారంభించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇలా జరగడం సర్వత్రా విషాదాన్ని నింపింది. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి ధైర్యం దక్కాలి అంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications