టేకాఫ్ విమానంలో అగ్నికీలలు: మరో ఫ్లైట్‌తో ఢీ: ఎయిర్‌పోర్ట్‌లో భయానకం

Japan: జపాన్‌లో సంభవించిన పెను భూకంపం వల్ల ఇప్పటివరకు 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కుప్పకూలిన నివాస భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.

46 వేలకు పైగా నివాసాలు భూకంపం బారిన పడ్డాయి. చాలావరకు నేలమట్టం అయ్యాయి. 62,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. 50 వేలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీనివల్ల సహాయక చర్యల్లో జాప్యం ఏర్పడుతోంది.

A Japan Airlines aircraft is on fire at Tokyo Airport

ఈ పరిస్థితులు ఒకవంక కొనసాగుతుండగా.. మరో ఘోర ప్రమాదం సంభవించింది జపాన్‌లో. టేకాఫ్ సమయంలో ఓ విమానంలో మంటలు చెలరేగాయి. దీనితో అదుపు తప్పిన ఫ్లైట్ పక్కనే పార్క్ చేసి ఉంచిన కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

టోక్యోలోని హెనెడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన సంభవించింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ350 రకానికి చెందిన విమానం అది. ప్రమాద సమయంలో విమానంలో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ తీసుకోవడానికి వేగంగా రన్‌వే మీదికి దూసుకొచ్చిన వెంటనే ఈ ఫ్లైట్‌లో మంటలు చెలరేగాయి.

దీనితో పైలెట్లు అప్రమత్తం అయ్యారు. సడన్‌గా బ్రేక్‌ను అప్లై చేశారు. దీనితో విమానం అదుపు తప్పి.. రన్‌వేకు కొద్ది దూరంలో పార్క్ చేసి ఉంచిన కోస్ట్ గార్డ్ ఫ్లైట్‌ను ఢీకొట్టింది. మంటలు అంటుకున్న విమానం కిటికీలను బద్దలు కొట్టి.. ప్రయాణికులను బయటికి తీసుకుని వచ్చారు రెస్క్యూ సిబ్బంది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పిందని జపాన్ న్యూస్ అవుట్‌లెట్ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+