షాక్: కీపర్ మెడలో నోట్లో పెట్టుకొని ఈడ్చుకెళ్ళిన సింహం
సర్కస్ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్ మాస్టర్ పై సింహం దాడి చేసింది.ఈ ఘటన ఫ్రాన్స్ లోని డౌల్లెన్స్ లో చోటుచేసుకొంది
ఫారిస్: సర్కస్ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్ మాస్టర్ పై సింహం దాడి చేసింది.ఈ ఘటన ఫ్రాన్స్ లోని డౌల్లెన్స్ లో చోటుచేసుకొంది.
సర్కస్ చేయిస్తున్న మాస్టర్ పై ఒక్కసారిగా దూకిన సింహం అతని ఛాతీ భాగంలో తీవ్రంగా గాయపర్చింది.ఇంతలో తేరుకొన్న సర్కస్ నిర్వహకులు సింహంపైకి పొగను వదిలి మాస్టర్ ను అక్కడి నుండి బయటకు తీసుకెళ్ళారు. తీవ్రంగా గాయపడిన మాస్టర్ ను ఆసుపత్రికి తరలించారు.

మాస్టర్ పై సింహం దాడి చేయడంతో షాక్ కు గురైన ప్రేక్షకులు ఆ ప్రాంతం నుండి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మాస్టర్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
అయితే ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications