కారులో లిక్కర్ తాగిన తల్లి, పాప ఏడుస్తోందని బిడ్డకు కూడా వైన్ తాగించి షాపింగ్ !
న్యూయార్క్/అమెరికా: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ చంటి బిడ్డ ఉంది. మహిళ ఎక్కువగా షాపింగ్ లు చేస్తోంది. వ్యాపారం పనుల మీద ఎక్కువగా బయట ఉంటున్న భర్త రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు. మద్యంకు బానిస అయిన భార్య ఆమె బిడ్డకు కూడా మద్యం తాగించడం కలకలం రేపింది.
కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలో హానె స్టీడిలా టోర్రే అలియాస్ టోర్రే (37) అనే మహిళ నివాసం ఉంటున్నది. వ్యాపారిని పెళ్లి చేసుకున్న టోర్రే హ్యాపీగా జీవితం గడుపుతున్నది. ఎక్కువ షాపింగులు చేస్తున్న టోర్రే ఆమె బిడ్డను పని మనుషుల దగ్గర పెట్టి కారులో బయటకు వెళ్లివస్తున్నది.

అయితే ఎంతసేపటికి బిడ్డ ఏడుపు మానకపోవడంతో టోర్రేకి చిర్రెత్తిపోయింది. కారులోనే ఉన్న లిక్కర్ బాటిల్ తీసుకున్న టోర్రే ఆమె బిడ్డకు పీకలదాక మద్యం తాగించింది. మద్యం మత్తులో ఉన్న చిన్నారి ఏడుపు మానేసి హాయిగా నిద్రపోయింది. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరువాత కాలిఫోర్నియా పోలీసులు ఎప్పటిలాగే వాహనాలు తనిఖీలు చేస్తూ టోర్రే వాహనం కూడా తనిఖీలు చేశారు.
ఆ సందర్బంలో టోర్రేతో పాటు ఆమె బిడ్డను కూడా పోలీసులు పరిశీలించారు. బిడ్డకు కూడా మద్యం తాగించారని పోలీసుల తనిఖీలో వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోయారు. వెంటనే తల్లి టోర్రేని అరెస్టు చేసిన పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో తన బిడ్డకు తానే వైన్ తాగించానని టోర్రే అంగీకరించిందని, ఆమెను జైలుకు పంపించామని, చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, కేసు విచారణలో ఉందని కాలిఫోర్నియా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications