F-16: వాషింగ్టన్ ప్రజలను వణికించిన ఎఫ్-16 జెట్..
అమెకాలోని వాషింగ్టన్ ప్రజలను ఎఫ్-16 జెట్ యుద్ధ విమానం వణికించింది. భారీ శబ్ధంతో నగంపై ఎగరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీపై ఓ ప్రైవేట్ విమానం అనుమానస్పదంగా తిరగడంతో ఎఫ్-16 జెట్ రంగంలోకి దిగడంతో కాసేపు భయాందోళన నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ విమానం టెన్నిసీ నగరంలోని ఎలిజబెత్ టౌన్ నుంచి ఓ విమానం గాల్లోకి టేకాఫ్ అయింది. ఈ విమానం న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. కానీ అది దిశను మార్చుకుని వాషింగ్టన్ నగరం గగనతలంలోకి వచ్చింది.
వాషింగ్టన్ లో వైట్ హౌస్ ఉంది. దీంతో అప్రమత్తమైన యూఎస్ మిలటరీ ప్రైవేట్ విమానం పైలట్ సంప్రదించారు. కానీ పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎఫ్-16 జెట్ యద్ధం విమానం రంగంలోకి దిగింది. ప్రైవేట్ విమానాన్ని వెంబడించింది. ఈ క్రమంలో సూపర్ సోనిక్ వేగంతో ప్రైవేట్ విమానాన్ని బయటకు పంపాలని చూసింది. ఈ యుద్ధ విమానం ప్రైవేట్ విమానం గుర్తించేందు ఫైర్ ను కూడా విడుదల చేసింది. దీంతో భారీగా శబ్దం వచ్చింది. వాషింగ్టన్ తో పాటు వర్జీనియాలో కూడా ఈ శబ్ధం వినిపించింది.

చివరకు ఆ ప్రైవేట్ విమానం మధ్యాహ్నం 3:20 గంటలకు తో జార్జ్ వాషింగ్టన్ నేషనల్ ఫారెస్ట్ సమీపంలో కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని తాము కూల్చలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ జెట్‌లకు సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే అధికారం ఉందని అధికారులు తెలిపారు. సోనిక్ బూమ్ తో భారీ శబ్దం రావడంతో మధ్యాహ్నం 3:10 గంటలకు మేరీల్యాండ్, వర్జీనియాలోని నివాసితులను భయపడి ఇళ్లలోకి వెళ్లిపోయారు. దాదాపు గంటపాటు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.
ఎలిజబెత్ టౌన్ నిసిపల్ విమానాశ్రయం నుండి విమానం బయలుదేరింది మరియు న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మాక్‌ఆర్థర్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిందని FAA తెలిపిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రైవేట్ విమానం గాల్లో ఎగురుతుండగా.. అధ్యక్షుడు బిడెన్ ఆదివారం మధ్యాహ్నం 12:49 నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్ సమీపంలోని కోర్సులో తన సోదరుడు జిమ్మీతో కలిసి గోల్ఫ్ ఆడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కుప్పకూలిన విమానం ఫ్లోరిడాకు చెందిన మెల్‌బోర్న్‌కు చెందిన ఎంకోర్ మోటార్స్‌లో రిజిస్టర్ అయి ఉందని పబ్లిక్ ఏవియేషన్ రికార్డులు చెబుతున్నాయి. ఫోన్ ద్వారా సంప్రదించిన జాన్ రంపెల్ తాను ఎన్‌కోర్ యజమాని అని చెప్పాడు. " తన కుమార్తె, మనవడు, మొత్తం కుటుంబం విమానంలో ఉంది. క్రాష్ గురించి మాకు ఏమీ తెలియదు" రంపెల్ చెప్పాడు. విమాన ప్రమాదం ఎవరు బతకలేదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications