30 రోజుల్లో మీ అధ్యక్షుడిని లేపేస్తాం: ఐఎస్
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ను 30 రోజుల్లో చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు బెదరించిన ఓ వీడియో యూట్యూబ్ లో పెట్టారు. మాల్దీవుల పోలీసులు ఆదేశ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
సాంగు టీవీ అనే ఓ ప్రయివేటు చానెల్ నుంచి ఈ వీడియో యూ ట్యూబ్ లో పెట్టారని తెలుసుకున్న పోలీసులు ఆ చానెల్ కార్యాలయం మీద దాడులు చేశారు. కార్యాలయంలోని 27 కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ చానెల్ లో పని చేస్తున్న ఎవరో ఒకరు ఈ వీడియోను అప్ లోడ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీవీ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం వాహీద్ స్పందిస్తూ ఈ వీడియో తాము అప్ లోడ్ చెయ్యలేదని స్పష్టం చేశారు.

కావాలనే తమ కార్యాలయం మీద దాడులు చేసి సోదాలు చేసి ప్రసార కార్యక్రమాలు నిలిపివేశారని ఆరోపించారు. అత్యవసర పరిస్థితులు అమలు చేసిన కొద్ది రోజులకే ఈ విదంగా యూ ట్యూబ్ లో వీడియో పోస్టు చెయ్యడంతో మాల్దీవులలో గట్టి భద్రత కల్పించారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అధ్యక్షుడితో పాటు పలువురు మంత్రుల మీద దాడులు చేసి చంపేస్తామని బెదిరించారు. పోలీసులు కోర్టు అనుమతితో దర్యాప్తు ముమ్మరం చేశారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications