Pregnancy Test: లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్.. యూకేలో అందుబాటులోకి వచ్చిన కిట్..
సాధారణంగా మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకుంటారు. మెడికల్ షాప్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చి దాంట్లో యూరిన్ డ్రాప్ వేసి టెస్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మరో రకంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అందుబాటులోకి వచ్చింది. అదే లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే విప్లవాత్మక ఉత్పత్తి UK, ఐర్లాండ్ లో అందుబాటులోకి వచ్చింది.
ఈ తరహా టెస్ట్ కిట్ ప్రపంచంలోనే మొదటిదని తయారీ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు మూత్రం లేదా రక్త పరీక్షల ద్వారానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే వారు ఇప్పుడు కొత్త కిట్ అందుబాటులోకి రావడం టెస్ట్ ను మరింత తేలిక చేసింది. ఇది మహిళలకు సాంప్రదాయ మూత్ర-ఆధారిత గర్భధారణ పరీక్షలకు ప్రత్యామ్నాయమని ఆ సంస్థ పేర్కొంది.

ఈ పరీక్ష కిట్‌ను జెరూసలేంకు చెందిన స్టార్టప్ సాలిగ్నోస్టిక్స్ అభివృద్ధి చేసింది. ఇది కోవిడ్ టెస్టింగ్ కిట్‌లను తయారు చేయడానికి ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన ఉత్పత్తి ఎక్కడైనా, ఎప్పుడైనా పరీక్షించగల సామర్థ్యాన్ని అందిస్తుందని వివరించింది. ఈ కిట్ తయారు చేసి దాదాపు 300 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేసినట్లు వెల్లడించింది.
ఈ కిట్ ద్వారా పరీక్ష చేసుకోవాలనుకునే వారు కిట్ ఒక భాగాన్ని థర్మామీటర్ లాగా నోటీలో పెట్టుకోవాలి. కొన్ని క్షణాలు నోటిలోనే ఉంచుకోవాలి. అది మీ నోటిలోని లాలాజల నమూనాను సేకరిస్తుంది. దానిని ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదిలీ చేస్తుంది. అక్కడ బయోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది అని కంపెనీ తెలిపింది.
పిండం అభివృద్ధి చెందడానికి గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో సహాయపడే గర్భధారణకు ప్రత్యేకమైన హార్మోన్ అయిన hCGని గుర్తించే సాంకేతికతపై ఈ పరీక్ష ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ కిట్ ద్వారా ఫలితాలను ఐదు నుంచి 15 నిమిషాలలోపు చదవవచ్చని చెప్పింది. ప్రారంభ సూచనలు మూడు నిమిషాల ముందుగానే కనిపిస్తాయి అని కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ
USలో ఉత్పత్తిని విక్రయించడానికి FDA ఆమోదం కోసం కూడా దరఖాస్తు చేసింది.












Click it and Unblock the Notifications