Fact Check: కెమెరాలో చిక్కిన గ్రహంతరవాసి.. వైరల్ అయిన వీడియో..
గ్రహంతరవాసులను మీరు ఎప్పుడైనా చూశారా.. అవి ఎలా ఉంటాయో మీకు తెలుసా.. తాజాగా ఓ వీడియోలో గ్రహంతరవాసి భూమి పైకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది వింతైనా ఆకారంలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఆకారంలో ఉంది గ్రహంతరవాసియేనా కాదా తెలియదు. ఈ వీడియో క్లిప్ మోర్‌హెడ్, కెంటుకీకి సమీపంలో ఈ వీడియో తీశారు.
5.2 లక్షలకు పైగా వ్యూస్
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వైరల్ అయింది. వీడియోలో ఓ వింత ఆకారం తెల్లటి పొగ లాగా కారు వైపు నడుస్తూ వస్తుండడం మనం చూడొచ్చు. పారానార్మాలిటీ మ్యాగజైన్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పోస్ట్ తోపాటు "KYలోని మూర్‌హెడ్ సమీపంలోని సెక్యూరిటీ క్యామ్‌లో చిక్కుకున్న లేత జీవి వీడియో ఇదిగో" అని రాశారు.

జూలై 9న రికార్డింగ్
ఈ వీడియో జూలై 9న రికార్డింగ్ చేసినట్లు నెటిజన్లు విశ్లేషించారు. ఇది నిజమైన వీడియో కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి గ్రాఫిక్ వీడియోలు చాలా చూశామని కొందరు కామెంట్ చేశారు.
Here's the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022












Click it and Unblock the Notifications