Flight: ఫ్లైట్‍లో అప్ అండ్ డౌన్ చేస్తున్న విద్యార్థిని.. పైసలు ఎక్కువుండి కాదు..

మీ ఇల్లు అబ్దుల్లాపూర్ మెట్ లేదా షామీర్ పేటలో ఉండి.. మీ ఆఫీస్ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉంటే అప్ అండ్ డౌన్ చేస్తారు. లేదంటే.. మాదాపూర్ చుట్టు పక్కల అద్దెలు ఎక్కుడ తక్కువ ఉంటే అక్కడ ఇల్లు అద్దె తీసుకుంటారు. ఒక వేళ మీ ఇళ్లు కరీంనగర్ లో ఉండి.. మీ ఆఫీస్ మాదాపూర్ ఉంటే.. వారు అప్ అండ్ డౌన్ చేయలేరు. సో వారు తప్పక ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలి. ఎందుకంటే కరీంనగర్, హైదరాబాద్ మధ్య 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం ఎవరు అప్ అండ్ డౌన్ చేయలేరు.

కాని ఓ అమ్మాయి.. 700 మైళ్ల దూరం అప్ అండ్ డౌన్ చేస్తోంది. అదీ ఓ బస్సులోనో.. ట్రైన్ లోనో కాదు.. విమానంలో. అవును మీరు విన్నది నిజమే. అమెరికాలోని సౌత్ కరోలినాలో సోఫియా సెలెంటానో అనే అమ్మాయి ఓ యూనివర్శిటీలో చదువుతుంది. ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ సంస్థలో సమ్మర్ ఇంటర్న్ షిప్ చేసే అవకాశం దక్కింది. అయితే ఆమె న్యూజెర్సీలో ఉండాలంటే ఇంటి అద్దె ఎక్కువ ఉంది.

A student in America is flying up and down from South Carolina to New Jersey

దీంతో ఆమె సౌత్ కరోలినా నుంచి న్యూజెర్సీ అప్ అండ్ డౌన్ చేయాలని నిర్ణయించుకుంది. రెండు నెలల ఇంటర్న్ షిప్ లో ఆమెకు వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్ రావాల్సి ఉండంతో విమానంలో వారానికి ఒకసారి విమానంలో న్యూజెర్సీ వచ్చి వెళ్తోంది. ఆమె కార్లెస్టన్ నుంచి సుమారు 700మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్లీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది. రెండు నెలల్లో మొత్తం 8 రోజులు మాత్రమే వెళ్లాలి కాబట్టి.. దీనంతటికీ ఆమెకు తక్కువ ఖర్చే అవుతుందని సోఫియా సెలెంటానో చెబుతోంది.

సోఫియా సెలెంటానో న్యూజెర్సీ వెళ్లే రోజు తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేస్తుందట. మరి విమానం ప్రయాణించడం ఖర్చుతో కూడుకున్నది కదా అని ప్రశ్నిస్తే.. ఆమె దానికి కొన్ని లెక్కలు కూడా చెప్పింది. ఆమె న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుంటే 3,400 డాలర్లు(2.7లక్షలు) అవుతుందట. అదే విమానంలో ప్రయాణం చేస్తే ఒక రోజుకు 100 డాలర్లు(రూ.8000) అవుతాయట. అంటే ఆమె ఎనిమిదిసార్లు వెళ్లి రావాలి అంటే.. ఆమెకు 64 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతోంది.

సోఫియా సెలెంటానో స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు ధన్యవాదాలు కూడ చెబుతోంది. రౌండ్‌ట్రిప్ టిక్కెట్‌లను కేవలం $100కే ఇస్తునందుకు ధన్యవాదాలు చెప్పింది. సెలెంటానో అంచనా ప్రకారం, ఆమె ప్రతి వారం ఎయిర్‌పోర్ట్‌కి రవాణా కోసం అదనంగా $100 ఖర్చు చేస్తుందట, ఆహారం కోసం $25తో పాటు మొత్తం రూ.లక్షా 44 వేలు ఖర్చు అవుతుంది. పైగా తనకు ప్రయాణాలంటే చాలా ఇష్టమని చెబుతోంది సోఫియా సెలెంటానో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+