వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘనిస్తాన్ ఎఫెక్ట్: సూపర్‌ మార్కెట్‌లో కత్తిపోట్లు: ఉన్మాది కాల్చివేత: ఉగ్రవాదుల పనే: పీఎం

|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్‌.. తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన తరువాత అక్కడ ఉగ్రవాదం వేళ్లూనుకుంటోంది. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఖొరాసన్ ప్రావిన్స్ ఇప్పటికే తన ఉనికి చాటుకుంది. ఆత్మాహూతి దాడితో పదుల సంఖ్యలో ఆఫ్ఘనిస్తానీయుల ప్రాణాలను బలి తీసుకుంది. అదే సమయంలో అల్-ఖైదా కూడా అక్కడ పాగా వేస్తోంది. ఇప్పటికే అల్‌ఖైదాకు చెందిన కొందరు టాప్ క్యాడర్ లీడర్లు ఆప్ఘనిస్తాన్‌కు చేరుకున్నారు కూడా. ప్రపంచదేశాలు భయపడినట్టుగానే ఉగ్రవాద ప్రభావం పెచ్చరిల్లుతోంది.

ఆరుమందికి కత్తిపోట్లు..

ఆరుమందికి కత్తిపోట్లు..

ఈ పరిణామాల మధ్య న్యూజిలాండ్‌లో ఉన్మాది ఒకరు రెచ్చిపోయాడు. సూపర్ మార్కెట్‌పై దాడికి పాల్పడ్డాడు. కనిపించిన వారిపై కనిపించినట్టే కత్తి ఝుళిపించాడు. ఈ ఘటనలో పలువురికి కత్తి గాయాలయ్యాయి. ఆరుమంది కత్తిపోట్లు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ వారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనను ఆ దేశ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్నా ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

దుండగుడి కాల్చివేత..

దుండగుడి కాల్చివేత..

ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద ప్రభావానికి గురైన యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. అతన్ని కాల్చి చంపారు. న్యూజిలాండ్‌ ప్రధాన నగరం అక్లాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన వ్యక్తిని శ్రీలంక జాతీయుడిగా గుర్తించారు. 2011లో అతను న్యూజిలాండ్‌కు వచ్చి.. ఇక్కడే స్థిరపడినట్లు పోలీసులు తెలిపారు. అక్లాండ్ శివార్లలోని న్యూలిన్ ప్రాంతంలో గల కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

సందర్శకులతో నిండివున్న సూపర్ మార్కెట్‌లో

సందర్శకులతో నిండివున్న సూపర్ మార్కెట్‌లో

న్యూజిలాండ్ కాలమానం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సూపర్ మార్కెట్ సందర్శకులతో నిండివున్న సమయంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆరుమందిని తీవ్రంగా గాయపరిచాడు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్ మేనేజ్‌మెంట్ వెంటనే అక్లాండ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఆగంతకుడిని లొంగిపోవాల్సిందిగా ఆదేశించారు.

కాల్చి చంపిన పోలీసులు..

కాల్చి చంపిన పోలీసులు..

అతను దానికి అంగీకరించలేదు. కత్తితో స్వైరవిహారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల సమక్షంలో కూడా అతను సందర్శకులకు దాడికి ప్రయత్నించాడు. దీనితో వారు అతణ్ని కాల్చి చంపారు. అతను ఈ దాడికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నామని అక్లాండ్ సిటీ పోలీస్ చీఫ్ తెలిపారు. ఆ కొద్దిసేపటికే ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ స్పందించారు.

ఉగ్రవాద చర్యగా..

ఉగ్రవాద చర్యగా..

అక్లాండ్ న్యూలిన్ ప్రాంతంలోని కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకున్న దాడి ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. హేట్ క్రైమ్‌గా దీన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడిగా భావిస్తున్నామని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదానికి ఆకర్షితుడైన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడరి అన్నారు. ఇలాంటి దారుణ ఘటనల పట్ల పోలీసులు ఉపేక్షించవద్దని, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు చెప్పారు.

Recommended Video

India vs New Zealand 2nd ODI : Guptill,Taylor Fifties Guide NZ To 273/8 | First Innings Highlights
2019 నాటి ఘటనను గుర్తుకు తెచ్చేలా..

2019 నాటి ఘటనను గుర్తుకు తెచ్చేలా..

న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దాడి ఘటన 2019లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదుపై చోటు చేసుకున్న దాడిలో 51 మంది మరణించారు. మసీదులో సామూహిక ప్రార్థనలను నిర్వహిస్తోన్న వారిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 51 మంది మరణించారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఆ తరువాత- ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ప్రభావంతో సూపర్ మార్కెట్‌పై దాడి చోటు చేసుకుంది.

English summary
A terrorist stabbed six people at an Auckland supermarket in New Zealand on Friday. Police shot him dead. New Zealand Prime Minister Jacinda Ardern said it was terrorist attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X