Viral Video: దాడికి దిగిన సింహాలు.. వీరోచిత పోరాటం చేసిన అడవి దున్న.. చివరికి ఏమైందంటే..
సోషల్ మీడియాల చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. తాజాగా ఓ అడవి దున్నపోతుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అడవి దున్నపోతుపై సింహాలు దాడి చేసే ప్రయత్నం చేయగా అది తప్పించుకుంది.

గంటకు 80 కి.లో మీటర్ల వేగం
సింహాలపై నుంచి జంపు చేస్తూ అత్యంత వేగంగ దూసుకెళ్లింది. నీటిలో పరిగెడుతూ సింహాల దాడి నుంచి బయటపడింది. ఈ వీడియోను మస్సిమో అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్టుతో పాటు అడవు దున్నపోతు చాలా బలమైంది. జంపింగ్ చేయడంతో పాటు గంటకు 80 కి.లో మీటర్ల వేగంతో దూసుకెళ్లిందని రాసుకొచ్చారు.

73 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోను బుధవారం పోస్ట్ చేయగా.. 73 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 వేల మందికి పైగా లైక్స్ చేయగా.. 400 మంది రీ ట్వీట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేశారు. అడవి దున్నపోతు చాలా వేగంగా పరుగెత్తిందని అన్నారు. ఈ రోజు ఆ జంతువు మంచి రోజని మరొకరు కామెంట్ చేశారు.
పులి దాడి చేయగా..
కొద్ది రోజులు క్రితం ఎద్దుపై పులి దాడి చేయడానికి యత్నంచగా ఎద్దు ప్రతిఘటించడంతో పులి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications