Dubai Rains: దుబాయ్‍లో భారీ వర్షం.. వైరల్ అవుతోన్న వీడియో..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా దుబాయ్ రోడ్లు నీటితో నిండిపోయాయి. వర్షం కారణంగా ట్రాఫిక్, విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమైయ్యాయి. దీంతో ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. దుబాయ్‌లోని ప్రజలు భారీ వర్షాల దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి ప్రజలు.
వీడియోలలో ఒక వ్యక్తి వరదలు ఉన్న రహదారిపై చిన్న పడవను రోయింగ్ చేస్తూ కనిపించాడు. ఇతర వీడియోలు నీటితో నిండిన, వరదలతో నిండిన రహదారుల కనిపించాయి. బీచ్‌లు, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. UAE వాతావరణ సంస్థ ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.

దుబాయ్ మునిసిపాలిటీ యుఎఇలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
రాబోయే కొద్ది రోజుల్లో మరింత వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా, వర్షాల తరువాత సౌకర్యవంతమైన పనిని అనుమతించాలని ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని కోరింది. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్, విమాన కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
భారీ వరదల ధాటికి బిల్డింగ్ ల ముందు పార్కింగ్ చేసిన కార్లు మునిగిపోయాయి. మరోవైపు రోడ్లపై నిలిచిన వర్షపు నీరును తరలించేందుకు దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు శ్రమిస్తున్నారు. సాధారణంగా దుబాయ్ లో ఎండకాలం, చలికాలం మాత్రమే ఉంటుంది. అక్కడ అరుదుగా వర్షాలు కురుస్తుంటాయి. అందుకే అక్కడి వారు ఇండియా నుంచి ఎక్కువగా కూరగాయలు, పండ్లు, బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంటారు.
#Mumbai? No! It's Dubai. Streets flooded due to heavy rains in #Dubai, #UAE. Dubai is listed alongside cities like #Paris, #NewYork, #London. But nature's fury remains to be one of the most challenging things for every country.#DubaiRains#MumbaiFloods#Nature'sFury#UAE #rains pic.twitter.com/LnYtsv8X8v
— N. K. Nayak (@nknayak17) November 18, 2023












Click it and Unblock the Notifications