హమ్మయ్యా.. ఆస్పత్రి నుంచి హలీవుడ్ నటుడు టామ్‌హంక్స్ డిశ్చార్జ్, ఆస్పత్రిలోనే అతని భార్య రీటా...
గత కొద్దిరోజులుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్, రీటా విల్సన్‌కు కూడా సోకిన సంగతి తెలిసిందే. దీంతో వారు షూటింగ్‌లో భాగంగా ఉన్న ఆస్ట్రేలియాలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే టామ్ హంక్స్‌కు పరిస్థితి మెరగవడంతో అతనిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ అతని భార్య రీటా విల్సన్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి మెరుగుపడిన తర్వాతే రిలీజ్ చేస్తామని స్పష్టంచేశారు.

షూటింగ్‌లో వైరస్..
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును పలుమార్లు గెలుచుకున్న టామ్ హంక్స్ షూటింగ్‌లో భాగంగా ఆస్ట్రేలియా వచ్చారు. ఎల్వీస్ ప్రెస్లీ బయోపిక్‌లో నటించేందుకు బ్రిస్బేన్ సమీపంలో గల గోల్డ్ కోస్ట్‌కు సతీసమేతంగా వచ్చారు. అయితే బయోపిక్ డైరెక్ట్ చేస్తున్న విల్సన్ సహా టామ్ హంక్స్ దంపతులు వైరస్ బారిన పడ్డారు. దీంతో కలకలం రేగింది. వెంటనే వారిని సమీప ఆస్పత్రిలో క్యారంటైన్‌లో ఉంచారు. టామ్ హంక్స్‌కు వైరస్ తగ్గడంతో అతనిని వైద్యులు ఇంటికి పంపించారు.

కచేరీలు కూడా..
నేపథ్య గాయకుడు, గేయ రచయిత అయిన విల్సన్ సిడ్నీ, బ్రిస్బేన్‌లో కచేరీలు కూడా నిర్వహించారు. ఆ తర్వాతే అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ సమయంలో అతను ఎవరితో కలిశారు, క్లోజ్‌గా ఎవరితో ఉన్నారనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. ఎవరైనా కరోనా వైరస్ బారినపడ్డారా అనే అంశంపై ఆరాతీస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 400 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు చనిపోయారు. వైరస్ రోజురోజుకు వ్యాప్తిచెందడంతో ఆందోళన నెలకొంది.
Recommended Video

డాక్టర్లకు థాంక్స్..
టామ్ హంక్స్ దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చిందనే అంశంపై సోషల్ మీడియాలో విసృత ప్రచారం జరిగింది. తమకు సకాలంలో వైద్యం అందించిన వైద్యులకు టామ్‌హంక్స్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక టామ్ హంక్స్.. గోల్డ్ కోస్ట్‌లో గల తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అతని భార్య రీటా మాత్రం ఆస్పత్రిలోనే ఉన్నారు. వైరస్ తగ్గాక.. అతనితో కలుస్తారని టామ్ హంక్స్ మేనేజర్ ఒకరు మీడియాకు తెలియజేశారు.
-
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్ అదాలత్ రికార్డ్ !! -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!












Click it and Unblock the Notifications