పాకిస్థాన్ కు జాక్ పాట్.. 410 బిలియన్ డాలర్లు సాయం చేసిన ADB..!

పాకిస్థాన్ కు ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ADB) మరోసారి భారీ సాయం ప్రకటించింది. పాకిస్థాన్ లోని రెఖో దిక్ కాపర్ అండ్ గోల్డ్ మైన్ ను అభివృద్ధి చేసేందుకు 410 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిక్షేపాలు పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. వీటి అభివృద్ధి 2028 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నిక్షేపాలు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి, బంగారం నిల్వల కేంద్రంగా దీన్ని నిపుణులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ లో ఇటీవల భారీగా రాగి, బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని చగాయ్ జిల్లాలో అధికారులు ఈ నిక్షేపాలను గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నిక్షేపాలను వెలికి తీసేందుకు పాకిస్థాన్ కు ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ADB) మరోసారి భారీ సాయం ప్రకటించింది. చగాయ్ జిల్లాలోని రెఖో దిక్ కాపర్ అండ్ గోల్డ్ మైన్ ను అభివృద్ధి చేసేందుకు 410 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మైనింగ్ ప్రాంతంలో తవ్వకాలను 2028 నుంచి ప్రారంభించనుంది పాకిస్థాన్ సర్కార్.

పాకిస్థాన్ కు ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ADB) ఇచ్చిన సాయంలో 300 మిలియన్ డాలర్లు కెనడాకు చెందిన బారిక్ అనే కంపెనీకు అలాగే 110 మిలియన్ డాలర్లను స్థానిక ప్రభుత్వానికి ఇచ్చినట్లు ఏడీబీ పేర్కొంది. రెఖో దిక్ కాపర్ అండ్ గోల్డ్ మైన్ అభివృద్ది పూర్తయితే ప్రపంచంలోనే అత్యధిక రాగి, బంగారు నిల్వలు కలిగిన ఐదో ప్రాంతంగా రెఖో దిక్ నిల్వనుంది. రెఖో దిక్ ప్రాంతం.. క్రిటికల్ మినరల్స్ సప్లై చెయిన్ కు ఉపయోగపడుతుందని అలాగే డిజిటల్ ఇన్నోవేషన్ డ్రైవింగ్ కు ఉపయోగపడుతుందని ఏడీబీ ప్రెసిడెంట్ మసాటో కండా ఓ ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రాజెక్ట్ ఓ గేమ్ ఛేంజర్ గా ఆయన అభివర్ణించారు.

ADB Announces 410 Million Aid Package for Pakistan s Rekhodik Copper and Gold Mine

ఇక ప్రస్తుతం బలూచిస్థాన్ ప్రాంతంలో రాగి, బంగారం నిల్వలతోపాటు బొగ్గు, క్రోమైట్, మార్బుల్ వంటి ఖనిజ నిల్వలు అధికంగా బయటపడ్డాయి. అయితే దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, భద్రతా పరిస్థితులు, మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం కారణంగా వీటిని అభివృద్ధి చేయడం గానీ తవ్వకాలు జరపడం కానీ చేయలేదు. ఇక ఈ నిల్వలు దేశానికి నిధుల కోసం అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+