అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ కూతురు గుర్గావ్‌లో జననం

గుర్గావ్: గుర్గావ్ నగరంలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ దంపతులకు ఓ పాప పుట్టింది. తన కుమార్తెను, భార్యను చూసేందుకు హమీద్ కర్జాయ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. హమీద్ కర్జాయ్ భార్య మంగళవారం ఉదయం పాపకు జన్మనిచ్చారు. తల్లీ, కూతురు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఈ మేరకు వివరాలను భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబారి షెయిదా మహ్మద్ అబ్దాలి మీడియాకు తెలిపారు. న్యూఢిల్లీ మీదుగా కొలంబో వెళుతున్న హమీద్ కర్జాయ్, బుధవారం ఇక్కడి ఆస్పత్రిలో అతని భార్య, కుమార్తెలను సందర్శించి వెళ్లారని చెప్పారు. హమీద్ కర్జాయ్ దంపతులు తమ కూతురుతో కాసేపు ఆనందంగా గడిపారని ఆయన తెలిపారు.

Afghan President Hamid Karzai's baby girl born in Gurgaon hospital

అయితే ఈ విషయంపై ఆస్పత్రి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. హమీద్ కర్జాయ్ వారం రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, ఆమెతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హమీద్ కర్జాయ్ తన కూతురు, భార్యతో ఆస్పత్రిలో దాదాపు 20 నిమిషాలపాటు గడిపినట్లు సమాచారం. హమీద్ కర్జాయ్ భార్య శుక్రవారం సాయంత్రం డిశ్చార్జ్ అవుతారని తెలిసింది.

హమీద్ కర్జాయ్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ కూడా అఫ్ఘానిస్థాన్‌లోని ఆస్పత్రిలోనే జన్మించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకే హమీద్ కర్జాయ్ తన భార్యను భారతదేశంలోని ఆస్పత్రికి తీసుకువచ్చారని అబ్దాలి తెలిపారు. ఆధునిక వైద్యం, పరికరాలు అందుబాటులో ఉండటంతోనే అక్కడి వైద్యులు భారతదేశంలో వైద్యం చేయించాల్సిందిగా కోరినట్లు చెప్పారు.

తమకు సహకరించిన ఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. తమకు ఎలాంటి అసౌకర్యం చోటు చేసుకోకుండా ఆధునిక వైద్య సేవలందించిన ఆస్పత్రి యాజమాన్యానికి కూడా రుణపడి ఉంటామని చెప్పారు. తమకు, తమ దేశానికి వైద్య సహాయంతోపాటు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న భారత ప్రభుత్వానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని అబ్దాలి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+