అఫ్గానిస్తాన్: కాబుల్‌ విమానాశ్రయం వద్ద భారతీయులకు ఏమైంది? వారి గురించి ఇప్పటివరకు మనకు ఏం తెలుసు?

అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. అక్కడ చిక్కుకున్న అఫ్గాన్‌ హిందువులు, సిక్కులను కూడా కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

''మేం కాబుల్‌లోని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం అమెరికా బలగాల ఆధీనంలో ఉంది. బయట పెద్దయెత్తున తాలిబాన్లు మోహరించి ఉన్నారు’’ అని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

కాబుల్ విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు వేల మంది ప్రయత్నిస్తున్నారని అక్కడున్న వారు చెబుతున్నారు. అయితే, కొద్ది మంది మాత్రమే లోపలకు వెళ్లగలుగుతున్నారని చెబుతున్నారు. తమ పౌరులను విమానాశ్రయానికి తీసుకు వచ్చేందుకు భారత్ కూడా ప్రయత్నిస్తోంది.

''అధికారులు లేరు’’

కాబుల్ విమానాశ్రయానికి సమీపంలో చిక్కుకున్న భారతీయుల్లో ఒకరు బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.

''మమ్మల్ని విమానాశ్రయంలోకి తీసుకెళ్లేందుకు రెండు రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’’.

''ఇక్కడ భారత అధికారులు ఎవరూ లేరు. మమ్మల్ని కాంట్రాక్టర్లే తీసుకుని వస్తున్నారు’’అని ఆయన వివరించారు.

''గత రెండు రోజులుగా మమ్మల్ని విమానాశ్రయానికి సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచారు. అయితే, ఈ రోజు ఉదయం మాతో ఉన్న కో-ఆర్డినేటర్‌ను తాలిబాన్లు తీసుకెళ్లారు’’అని మరో వ్యక్తి చెప్పారు.

తాలిబాన్లు

అఫ్గాన్ హిందువులను వేరు చేశారు..

ఈ బృందానికి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న భారతీయుడు జుహైబ్ కూడా బీబీసీతో మాట్లాడారు. ''మా బస్సుల్లోకి ఇద్దరు తాలిబాన్లు ఎక్కారు. వారు అఫ్గాన్ హిందువులు, సిక్కులను.. భారతీయుల నుంచి వేరుచేశారు. భయంతో కొందరు అఫ్గాన్ సిక్కులు, హిందులు దగ్గర్లోని గురుద్వారాకు వెళ్లిపోయారు’’అని ఆయన వివరించారు.

''తాలిబాన్లు మా డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆ తర్వాత దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీకి మమ్మల్ని తరలించారు. అక్కడే మేమంతా కూర్చుని ఉన్నాం.’’

''మమ్మల్ని త్వరలో కాబుల్ విమానాశ్రయానికి పంపించే అవకాశముంది. భారతీయుల్లోని కొందరిని తాలిబాన్లు ప్రశ్నించారు. కొందరి మొబైల్ ఫోన్లను బద్దలు కొట్టారు’’అని జుహైబ్ వివరించారు.

''అఫ్గాన్ పౌరులను బస్సుల్లోనే కూర్చొబెట్టారు. మేం పది నుంచి ఇక్కడే ఉన్నాం’’అని అఫ్గానీ సిక్కు అనార్కలీ కౌర్ బీబీసీతో చెప్పారు.

విదేశాంగ శాఖ ఏం చెబుతోంది?

ఈ వార్తలను ఇప్పుడే తాము ధ్రువీకరించలేమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ బీబీసీతో చెప్పారు.

మరోవైపు భారతీయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు కూడా అఫ్గాన్ మీడియాలో వస్తున్నాయి.

అయితే, భారతీయులను కిడ్నాప్ చేశామనే వార్తలను తాలిబాన్లు ఖండిస్తున్నారు.

''మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు. వారిని ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్నాం’’అని తాలిబాన్ అధికార ప్రతినిధి అమనుల్లా వాసిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+